మాస్ రాజా మడత ఎలా పెడతాడంటే?
ఇందులోనూ అదే రిపీట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
By: Tupaki Desk | 24 March 2025 12:26 PMమాస్ రాజా రవితేజ కథానాయకుడిగా భాను భోగవరపు దర్శకత్వంలో 'మాస్ జాతర' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో మరోసారి మాస్ కంటెంట్ తోనే రాజా రాబోతున్నట్లు తేలిపోయింది. ఇందులో రవితేజకు జోడీగా శ్రీలీల నటిస్తుంది. ఇద్దరి కాంబినేషన్ 'ధమాకా'లా బాగా వర్కౌట్ అవ్వడంతో? ఇందులోనూ అదే రిపీట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఆ సక్సెస్ కి సెంటిమెంట్ గానే శ్రీలీలను తెరపైకి తెచ్చారు. సినిమాలో కొన్ని రవితేజ పాత పాటలు కూడా రీమిక్స్ చేస్తున్నారు. మాస్ రాజా ఇమేజ్ కిది బాగా కలిసొచ్చేదే. మ్యూజికల్ గా మంచి ఫాంలో ఉన్న భీమ్స్ ఆ బాధ్యతలు తీసుకోవడంతో మాస్ ఆడియన్స్ లోకి సినిమా బలంగా వెళ్తుందని టీమ్ భావిస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ టేడ్ వచ్చింది.
ప్రధమార్ధంలో వచ్చే ఓ యాక్షన్ సన్నివేశాన్ని వెంకట్ మాస్టర్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో రవితేజ ఆర్పీఎఫ్ పోలీస్ పాత్ర పోషిస్తున్నాడు. యూనిఫాంలోనే ప్రత్యర్ధుల్ని పరిగెట్టించే ఫైట్ ఇది. దానికి సంబం ధించిన కొత్త పోస్టర్ ఒకటి వైరల్ అవుతుంది. మాస్ రాజా ఫైట్ లో కాస్త యాక్షన్ కూడా మేళవిం చడం పరిపాటే. ఇందులో రవితేజ పాత్ర కామిక్ గానూ ఉంటుందని ఇప్పటికే లీకులందుతున్నాయి.
రవితేజ మాస్ కి కనెక్ట్ అవ్వడానికి అలాంటి సన్నివేశాలే కీలకం. ఈ నేపథ్యంలో మాస్ జాతర వాటికి ఏమాత్రం కొదవ లేనట్లే తెలుస్తోంది. రవితేజకు ఇదొక ల్యాండ్ మార్క్ చిత్రం కావడం విశేషం. ఆయన నటిస్తోన్న 75వ చిత్రమిది. దీంతో ఈ సినిమా మంచి విజయం సాధించి కెరీర్ లో నిలిచిపోవాలని అభిమా నులు ఆశిస్తున్నారు.