మాస్ రాజా మళ్లీ అదే సెంటిమెంట్ రిపీట్!
మాస్ రాజా రవితేజ నటించిన `మాస్ జాతర` రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది. మరో మూడు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
By: Tupaki Desk | 29 Oct 2025 2:00 AM ISTమాస్ రాజా రవితేజ నటించిన `మాస్ జాతర` రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది. మరో మూడు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాజా అభిమానులు రిలీజ్ గడియలు కోసం అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో మంచి బజ్ నెలకొంది. ఈసారి హిట్ కొట్టడం ఖాయమంటూ అభిమాను లు ధీమాగా ఉన్నారు. రవితేజ మాస్ యాంగిల్ ని కాస్త కొత్తగా చూపిస్తే చాలు బొమ్మ హిట్ ఖాయమే. అదే ఆశతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. వరుస పరాజయాల నేపథ్యంలో రిలీజ్ అవుతున్న చిత్రం కావడంతో రాజాకి కూడా ఈ విజయం కీలకమైందిగా మారింది.
హిట్..ప్లాప్ ల మధ్యలో హీరో:
అయితే హిట్...ప్లాప్ విషయంలో రవితేజకు ఇక్కడ మళ్లీ పాత సెంటిమెంట్ రిపీట్ అవ్వాలి. లేదంటే కథ మళ్లీ కంచికే. మరి ఏంటా సెంటిమెంట్? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. `రాజా దిగ్రేట్` తర్వాత తర్వాత రవితేజకు వరుసగా నాలుగు ప్లాప్ లు పడ్డాయి. `టచ్ చేసి చూడు`, `నేల టికెట్టు`, `అమర్ అక్బర్ ఆంటోనీ`, `డిస్కోరాజా` నాలుగు సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద చతికిల పడినవే. ఆ తర్వాత మళ్లీ `క్రాక్` విజయంతో పట్టాలెక్కాడు. ఈ సక్సెస్ తో మరిన్ని విజయాలు అందుకుంటాడు? అనుకుంటే మళ్లీ పరాభవాలు తప్పలేదు.
మాస్ జాతర హిట్ కు అవకాశాలు:
`ఖిలాడీ`, `రామారావు` రూపంలో రెండు ప్లాప్ లు ఎదురయ్యాయి. కానీ ఆ వెంటనే మళ్లీ `ధమాకా` విజయంతో అదే ఏడాది బౌన్స్ అయ్యాడు. ఈసారైనా ఆ సక్సస్ స్పూర్తితో జాగ్రత్త పడతాడు అనుకుంటే? మళ్లీ నాలుగు డిజాస్టర్లు తప్పలేదు. `రావణాసుర`, `టైగర్ నాగేశ్వరరావు`, ` ఈగల్`, `మిస్టర్ బచ్చన్` రూపంలో వరుస ప్లాప్ లు చూసాడు. వరుస ప్లాప్ ల తర్వాత హిట్ పడటం అన్నది రవితేజ సెంటిమెంట్ కోణంలో చూస్తే `మాస్ జాతర` బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఐదవ ప్లాప్ కు ఛాన్స్ ఇవ్వకూడదు. లేదంటే ఆర్డర్ మారుతున్నట్లే అవుతుంది.
వెకేషన్లకు దూరంగా మాస్ రాజా:
ప్రస్తుతం రవితేజ చేతిలో కొత్త ప్రాజెక్ట్ లు కూడా ఏవీ కమిట్ అవ్వలేదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత కొత్త సినిమాల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొంత కాలంగా విరామం లేకుండా సినిమాలు చేస్తున్నారు. దీంతో గ్యాప్ కూడా అనివార్యమైందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రవితేజ వెకేషన్లకు వెళ్లడం చాలా రేర్. సినిమాలు చేయడం...హైదరాబాద్ లో ఉండటం తప్ప స్నేహితులతో చిలౌట్ అవ్వడం పెద్దగా కనిపించదు. మరి `మాస్ జాతర` రిలీజ్ తర్వాత కొత్తగా మరేదైనా ప్లాన్ చేస్తున్నారా? అన్నది తెలియాలి.
