ఏషియన్ వింగ్‌లోకి మాస్ మహారాజా రవితేజ
ఏషియన్ సినిమాస్ పేరుతో సునీల్ నారంగ్ గ్రూప్ మల్టీప్లెక్స్ థియేటర్ల వింగ్‌ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 9 Jun 2025 4:17 PM ISTఏషియన్ సినిమాస్ పేరుతో సునీల్ నారంగ్ గ్రూప్ మల్టీప్లెక్స్ థియేటర్ల వింగ్‌ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మల్టీప్లెక్స్ వింగ్‌లోకి స్టార్ హీరోలు అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎంటరయ్యారు. ఏషియన్ మల్టీప్లెక్స్ థియేటర్స్ చైన్‌లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు గచ్చిబౌలిలోని ఏఎంబీ మాల్‌ని ప్రారంభించడం తెలిసిందే.
ఇదే తరహాలో విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్‌లో ఇదే ఏషియన్ థియేటర్స్ అండర్‌లోనే మల్టీప్లెక్స్ థియేటర్‌ని ప్రారంభించడం, అమీర్ పేట్ సత్యం థియేటర్ ప్లేస్‌లో అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఏషియన్ థియేటర్‌ని స్టార్ట్ చేయడం తెలిసిందే. ఇప్పుడు ఇదే గ్రూప్‌లోకి మాస్ మహారాజా రవితేజ ఎంటరవుతున్నారు. ఆయన కూడా మల్టీప్లెక్స్ థియేటర్ ని ప్రారంభించబోతున్నారు.
ఏఆర్టీ సినిమాస్ పేరుతో రవితేజ మల్టీప్లెక్స్ థియేటర్‌ని ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని తాజాగా ఏషియన్ గ్రూప్స్ అధినేత సునీల్ నారంగా వెల్లడించారు. సకల హంగులతో రూపొందించిన ఏషియన్ రవితేజ థియేటర్‌ని వనస్థలిపురంలో ప్రారంభించబోతున్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ప్రీమియం మల్టీప్లెక్స్ ఏషియన్ గ్రూప్ విస్తరణలో ఓ మైలురాయిగా చెబుతున్నారు.
ఇందులో ఆరు ఆల్ట్రా మోడ్రన్ స్క్రీన్స్ ఉంటాయి. ఒక్కో స్క్రీన్‌ని అసాధారణమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్‌ని ప్రేక్షకుడిని అందించే విధంగా అత్యాధునిక ఆడియో - విజువల్ టెక్నాలజీతో రూపొందించారట. ఈ ఆరు స్క్రీన్‌లలో ప్రత్యేకంగా 57 అడుగుల వెడల్పుగల భారీ EPIQ ఓ స్క్రీన్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది సినీ లవర్స్‌కు సరికొత్త అనుభూతిని అందిస్తుందట.
ఈ విషయాల్ని వెల్లడిస్తూ సునీల్ నారంగ్ అసలు విషయం బయటపెట్టారు. ఈ మల్టీప్లెక్స్ థియేటర్‌ని జూలైలో ప్రారంభించబోతున్నామని స్పష్టం చేశారు. రవితేజ టేస్టఖు తగ్గట్టుగా ఈ థియేటర్ ని ప్రపంచ స్థాయి ప్రమాణాలు, సౌకర్యాలతో నిర్మించారట. సినిమాని సరికొత్త డైమెన్షన్‌లో ఆస్వాదించాలనుకునే వారికి ఏఆర్టీ సినిమాస్ సరికొత్త డెస్టినేషన్‌గా నిలవనుందని ఇన్ సైడ్ టాక్.
