మాస్ రాజా మ్యాడ్ కాంబినేషన్.. ఇది అసలు మ్యాటర్!
టాలీవుడ్ మాస్ రాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ చూసి చాలా కాలైమైంది. చివరగా 2022లో ధమాకా సినిమాతో సోలో హీరోగా సాలీడ్ హిట్ అందుకున్నాడు.
By: Tupaki Desk | 11 July 2025 11:36 AM ISTటాలీవుడ్ మాస్ రాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ చూసి చాలా కాలైమైంది. చివరగా 2022లో ధమాకా సినిమాతో సోలో హీరోగా సాలీడ్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత మెగాస్టార్ తో చేసిన వాల్తేరు వీరయ్య మంచి ఫలితాన్ని ఇచ్చింది. అనంతరం రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. అయినా కూడా తన ఎనర్జీతో, నటనతో మాస్ ఆడియన్స్‌లో ప్రత్యేక స్థానాన్ని కాపాడుకుంటూనే ఉన్నాడు.
రవితేజ గత సినిమాల వల్ల నిర్మాతలు కొంత మేర నష్టపోయినా, ఆయనపై ఇంకా మిగతా నిర్మాతలు నమ్మకాన్ని చూపిస్తుండటం విశేషం. ప్రస్తుతం రవితేజ “మాస్ జాతర” అనే మాస్ ఎంటర్టైనర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 27న విడుదల కాబోతుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ దీనిని నిర్మిస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే రవితేజతో మరో సినిమా ప్లాన్ చేస్తోంది.
అదే తాజా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. మ్యాడ్ ఫ్రాంఛైజీకి దర్శకత్వం వహించిన కళ్యాణ్ శంకర్ ఒక కథను రవితేజకు వినిపించారు. ఆ కంటెంట్ ఫాంటసీ కామెడీ నేపథ్యంలో ఉంటుందట. ఇక కథ విన్న రవితేజ ఫుల్ గా ఇంప్రెస్ అయ్యారని టాక్. కానీ ప్రస్తుతం ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా ప్లాన్‌లో ఉండటంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై స్పష్టత రావాలంటే కొంతకాలం ఎదురుచూడాల్సి ఉంటుంది. రవితేజ డేట్స్ పూర్తయ్యాకే కొత్త సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
అయితే రవితేజ కెరీర్ స్థితిగతులను, ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న హంగామాను పరిశీలిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్, ఈ కొత్త సినిమా విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలని భావిస్తోంది. ముఖ్యంగా రవితేజతో తెరకెక్కుతున్న "మాస్ జాతర" సినిమా ఫలితం ఆధారంగా కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇక ముందస్తుగా నాన్ థియేట్రికల్ డీల్స్ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ మంచి డీల్ క్లోజ్ అయితే, ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది. లేకపోతే ఈ సినిమా తాత్కాలికంగా వాయిదా పడే ఛాన్స్ ఉంది. “మాస్ జాతర” ఎంతవరకు హిట్ అవుతుందోనన్నది ఇక కీలకం. ఆ ఫలితం ఆధారంగానే ఈ మ్యాడ్ కాంబినేషన్ సాగనుంది. మొత్తానికి రవితేజ - కళ్యాణ్ శంకర్ కాంబినేషన్ ఓ యూత్‌ఫుల్ మాస్ ఎంటర్టైనర్‌కి తగిన కాంబో అనిపిస్తోంది. “మ్యాడ్”లా ఎంటర్టైనింగ్ కంటెంట్‌తో రవితేజ ఎనర్జీ కలిసితే మంచి మాస్ సినిమా రావొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ కాంబోపై అఫీషియల్ క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.
