రవితేజ "విజ్ఞప్తి"లో తేడా.. లాజిక్ ఓకే కానీ..?
మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
By: Tupaki Desk | 2 Dec 2025 11:24 AM ISTమాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఆషిక రంగనాథ్, డింపుల్ హయతి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. ఐతే రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా టైటిల్ లో విజ్ఞప్తికి V బదులుగా W పెట్టారు. అదేంటి విజ్ఞప్తికి V స్టార్టింగ్ లెటర్ కదా అని అందరు అనుకున్నారు. కానీ ఇదంతా సినిమా ప్రమోషన్స్ స్ట్రాటజీ అని తెలుసుకుని సర్ ప్రైజ్ అవుతున్నారు.
వరుస సినిమాలతో మాస్ రాజా..
భర్త మహాశయులకు విజ్ఞప్తి.. దీన్ని ఇంగ్లీష్ షార్ట్ కట్ లో BMV అని రాయాలి. అదే 'V' బదులుగా టైటిల్ లోనే 'W' పెడితే.. BMW అని వస్తుంది. లగ్జరీ కార్లలో రాజైన BMW వర్డ్ అందరికీ తెలుసు అలా షార్ట్ కట్ ఫాం ప్రమోషన్స్ కి బాగా ఉపయోగపడుతుందని అలా ఫిక్స్ చేశారు మేకర్స్. ఐతే BMV అయినా BMW అయినా సినిమాలో మ్యాటర్ ఉంటే కచ్చితంగా ఆడియన్స్ గుర్తుంచుకుంటారు.
మాస్ రాజా ఈమధ్య వరుస సినిమాలతో నిరాశపరుస్తున్నారు. ధమాకా తర్వాత ఆయన సాలిడ్ హిట్ కొట్టిన సినిమా పడలేదు. ఐతే రిజల్ట్ తో సంబంధం లేకుండా రవితేజ తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రవితేజ మాస్ జాతర రీసెంట్ గా వచ్చింది. ఆ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి కానీ అది కూడా మిస్ ఫైర్ అయ్యింది. ఐతే కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి మాత్రం కచ్చితంగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని అలరిస్తుందని నమ్మకంగా ఉన్నారు.
రవితేజ ఎనర్జీకి కిషోర్ తిరుమల..
రవితేజ ఎనర్జీకి కిషోర్ తిరుమల లాంటి క్లాస్ డైరెక్టర్ ఒక మంచి ఎంటర్టైనింగ్ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో వస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో అందాల భామలు ఆషిక రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటించడం కూడా సినిమాకు మంచి బజ్ ఏర్పరుస్తుంది. సంక్రాంతి బరిలో మాస్ మహారాజ్ భర్త మజాశయులకు విజ్ఞప్తి సినిమా వస్తుంది. ఈ సినిమాతో రవితేజ మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. భీంస్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ఆల్రెడీ రిలీజై ఫ్యాన్స్ ని ఖుషి చేసింది.
కిషోర్ తిరుమల సినిమాలు యూత్ ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అవుతాయి. ఐతే సినిమా సినిమాకు ఆయన ఎక్కువ గ్యాప్ తీసుకుంటారన్న టాక్ ఉంది. రవితేజతో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు కిషోర్ తిరుమల. మరి మాస్ రాజా ఫ్యాన్స్ కి ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తితో ఎలాంటి ట్రీట్ అందిస్తారో చూడాలి.
