ట్విట్టర్ లో నెగిటివిటీ.. రవితేజ ఏమన్నారంటే?
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 7 Oct 2025 11:05 PM ISTటాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. రిజల్ట్ తో సంబంధం లేకుండా థియేటర్స్ లోకి తన చిత్రాలతో వస్తున్నారు. ఒక్క మూవీ పూర్తి అవ్వగానే.. మరో సినిమాను స్టార్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు మాస్ జాతరతో త్వరలో రానున్నారు.
అక్టోబర్ 31వ తేదీన వరల్డ్ వైడ్ గా ఆ సినిమా రిలీజ్ కానుండగా.. మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. సినిమా నుంచి వరుస అప్డేట్స్ వస్తుండగా.. సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. మూవీపై బజ్ కూడా క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు రవితేజ.. రంగంలోకి దిగారు. సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
అందులో భాగంగా ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో రవితేజను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారని హోస్ట్ సుమ అడగ్గా.. ఆయన స్పందించారు. తాను అప్పుడప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తుంటానని తెలిపారు. అది కూడా సరదాగా చూస్తుంటానని, అవి చాలా క్రియేటివ్ గా ఉంటాయని చెప్పారు. కానీ ట్విట్టర్ అలా కాదని చెప్పుకొచ్చారు.
అందులో నెటిజన్లు ఎప్పుడూ నెగిటివ్ వైబ్స్ ను స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పారు. అయితే తానెప్పుడూ నెగిటివ్ కామెంట్స్ ను చదవవని అన్నారు. తాను నెగిటివిటీకి దూరంగా ఉండటానికి ఇష్టపడతానని తెలిపిన రవితేజ.. అది తనను ఇబ్బంది పెట్టదని పేర్కొన్నారు. అదే సమయంలో తాను ట్విట్టర్ కు దూరంగా ఉండటానికి ఇష్టపడతానని తెలిపారు.
ఇక మాస్ జాతర సినిమా విషయానికొస్తే.. ఇప్పటి వరకు రవితేజ పోలీస్ గానే కనిపిస్తారని అందరికీ తెలుసు. ప్రమోషనల్ కంటెంట్ ద్వారా అది క్లారిటీ వచ్చింది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే చాలా మంది అనుకున్న పోలీస్ లా కాకుండా ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) లోని పోలీస్ గా కనిపించనున్నారు. ఆ విషయాన్ని ఆయనే రివీల్ చేశారు.
సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తున్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న మాస్ జాతర మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూరుస్తున్నారు. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
