జయం రవి (X) ఆర్తి గొడవ.. నన్ను చంపేస్తామని బెదిరించారు!
కెనిషా ఫ్రాన్సిస్ ఇన్‌స్టాలో ఆవేదనగా స్పందించారు. నేను ఎవరికీ భయపడను.. పారిపోను. ఎవరి నుండి దాచడానికి ఏమీ లేదు.
By: Tupaki Desk | 23 May 2025 1:16 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ తన భార్య ఆర్తి నుండి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి కోర్టు అనుమతించకూడదు అంటూ ఆర్తి పోరాటం సాగిస్తోంది. అయితే మే 21న కోర్టు విచారణలో, భర్తతో కాపురం కోసం ఆర్తి దరఖాస్తు చేయగా, అభ్యర్థనను తిరస్కరించాలని రవి కోర్టును కోరారు. కోర్టు రెండు పార్టీలకు వారి పిటిషన్లను పునఃపరిశీలించాలని సూచించింది. తదుపరి విచారణను జూన్ 12 వరకు వాయిదా వేసింది.
అయితే ఇటీవలే ఆర్తి రవి తమ మధ్య మూడో వ్యక్తి ఉందని ఆరోపించిన సంగతి తెలిసిందే. అనంతరం 40లక్షల నెలవారీ భరణం కావాలని కోరినట్టు కథనాలొచ్చాయి. ఇంతలోనే ఇప్పుడు రవి స్నేహితురాలు కెనిషా ఫ్రాన్సిస్ తనను చంపేస్తామంటూ బెదిరించారని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కొన్ని స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసారు. కెనిషాతో రవి సంబంధంపై ఆర్తి రవి పరోక్షంగా విమర్శించిన తర్వాత తాజా పరిణామమిది.
కెనిషా ఫ్రాన్సిస్ ఇన్‌స్టాలో ఆవేదనగా స్పందించారు. నేను ఎవరికీ భయపడను.. పారిపోను. ఎవరి నుండి దాచడానికి ఏమీ లేదు. నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఉంది కానీ దయచేసి నా ముఖం మీద అడగండి.. ప్రతి ఒక్కరికీ బహిరంగంగా నా వైపు కథను చెబుతాను. తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయొద్దు. నాపై అనుమానం ఉంటే, దయచేసి నన్ను కోర్టుకు తీసుకెళ్లండి. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటూ నోట్ లో ఎమోషనల్ గా స్పందించింది. మీరంతా కర్మ సిద్ధాంతం మాట్లాడుతున్నారు. కానీ చట్టబద్ధంగా నేను నిరూపించాక.. మీకు కూడా అలాంటి బాధ కలగాలని నేను కోరుకోను అని తెలిపింది.
మరొక ఇన్‌స్టా స్టోరీలో కెనిషా ఫ్రాన్సిస్ తన చర్యలు తప్పు అయితే, దేవుడు తనను శిక్షిస్తాడని రాశారు. మీలో చాలా మందికి నా గురించి నిజం తెలీదు. బాధ తెలియదు కాబట్టి ఇలాంటి దారుణమైన మాటలు అంటున్నారు. మీ ఊహలు మిమ్మల్ని బాధపెడుతున్నందుకు నేను క్షమించండి. కానీ త్వరలోనే ఏదో ఒక రోజు నిజం బయటపడాలని నేను దేవుళ్లను ప్రార్థిస్తున్నాను. నేను తప్పు చేస్తే చట్టం శిక్షిస్తుంది! అని అన్నారు.
