Begin typing your search above and press return to search.

బెడ్ మీద భార్య కాళ్లకు భ‌ర్త న‌మ‌స్కారం!

భార్యాభ‌ర్త‌లు స‌మాన‌మైనా? ఇప్ప‌టికీ పురుషాధిక్యమే కొనసాగుతుంది. సంప్ర‌దాయం పేరుతో ఇప్పటికి మ‌హిళామ‌ణులు అణిచి వేత‌కు గుర‌వుతున్నారు

By:  Tupaki Desk   |   24 July 2025 1:08 PM IST
బెడ్ మీద భార్య కాళ్లకు భ‌ర్త న‌మ‌స్కారం!
X

భార్యాభ‌ర్త‌లు స‌మాన‌మైనా? ఇప్ప‌టికీ పురుషాధిక్యమే కొనసాగుతుంది. సంప్ర‌దాయం పేరుతో ఇప్పటికి మ‌హిళామ‌ణులు అణిచి వేత‌కు గుర‌వుతున్నారు. భ‌ర్త‌ల చేతుల్లో భార్య‌లు కీలుబొమ్మ‌గానే మారుతున్నారు. అలాంటి భ‌ర్త‌లంద‌రికీ క‌నువిప్పు క‌లిగించాడు బోజ్ పురీ న‌టుడు ర‌వి కిష‌న్. అవును ర‌వికిష‌న్ భార్య‌కు ఎంత‌గా గౌర‌వం ఇస్తాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. రోజు ప‌డుకునే ముందు ర‌వికిష‌న్ త‌న భార్య కాళ్ల‌కు న‌మ‌స్క‌రించి ప‌డుకుంటాడుట‌. ఇలా కొన్ని సంవ‌త్స‌రాలు గా చేస్తున్న‌ట్లు తెలిపాడు.

మ‌రి ఆ భార్య ఇలాంటి న‌మ‌స్కారాని ఎలా అంగీక‌రించింది? అన్న డౌట్ వ‌స్తుంది. అందుకే ర‌వికిష‌న్ త‌న భార్య నిద్ర‌లోకి జారుకున్న త‌ర్వాత కాళ్ల‌కు న‌మ‌స్కారం చేస్తాడుట‌. ఓసారి నిద్ర‌పోయే ముందు చేస్తే అలా చేయ కూడ‌ద‌ని..తాను అసౌక‌ర్యంగా ఫీలవుతుంద‌ని భావించి నిద్ర‌లోకి వెళ్లిన త‌ర్వాత ఆ పని చేస్తున్న‌ట్లు తెలిపాడు. `నా భ‌ర్య నాజీవితం అత్యంత క్లిష్ల ప‌రిస్థితుల్లో ఉన్న స‌మ‌యంలో ఎంతో అండ‌గా నిలిచింది. డ‌బ్బు, ప‌లుక‌బ‌డి లేన‌ప్పుడు కూడా నా ప‌క్క‌నే ధైర్యంగా నిల‌బ‌డింది.

నేను ఈ స్థానంలో ఉన్నానంటే కార‌ణం నా భ‌ర్యే. అంత చేసిన ఆన‌కు త‌న‌కు ఏం ఇవ్వ‌గ‌ల‌ను. ఏది ఇచ్చినా అది త‌క్కువే అవుతుంది. అందుకే భార్యాభ‌ర్త‌లు స‌మానం అంటారు కాదా? అందుకే ఆమె కాళ్ల‌కు న‌మ‌స్క‌రించ‌డం మొద‌లు పెట్టాను. ఇది త‌న‌ను బాధ‌పెట్టినా? న‌న్ను మాత్రం ఎంతో సంతోష పెడుతుం దన్నారు. ఈ విష‌యాన్ని ర‌వికిష‌న్ `ది గ్రేట్ ఇండియ‌న్ క‌పిల్ షో`లో రివీల్ చేసాడు.

ర‌వికిష‌న్ టాలీవుడ్ ఆడియ‌న్స్ కు బాగా సుప‌రిచితుడే. `రేసుగుర్రం` సినిమాలో మ‌ద్దాలి శివారెడ్డి పాత్ర‌లో అల‌రించిన సంగ‌తి తెలిసిందే. ఒక్క సినిమాతోనే బోలెడంత పాపుల‌ర్ అయ్యాడు. ఆ త‌ర్వాత `కిక్2` , `సుప్రీమ్` , `రాధ‌`, `లై ` స‌హా చాలా చిత్రాల్లో న‌టించాడు. బాలీవుడ్ లోనూ చాలా సినిమాలు చేసాడు. సౌత్ లో కూడా దాదాపు అన్ని భాష‌ల్లోనూ న‌టించాడు.