డైరెక్టర్ గా ప్రభాస్ మ్యూజిక్ డైరెక్టర్.. తెలుగులో కూడా..
ఇప్పుడు రవి బస్రూర్.. వీర చంద్ర హాస టైటిల్ తో ఓ మూవీని తెరకెక్కించారు. గత శుక్రవారం కర్ణాటకలోని థియేటర్లలో విడుదలైన ఆ సినిమా.. ఇప్పుడు దూసుకుపోతోంది.
By: Tupaki Desk | 21 April 2025 8:27 AMపాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాకు మ్యూజిక్ అందించిన రవి బస్రూర్.. ఇప్పుడు డైరెక్టర్ గా మారారు. సలార్ సినిమా కన్నా ముందే ఆయన కాంతార చిత్రంతో మెప్పించారు. తెలుగు వారికి కూడా దగ్గరయ్యారు.
ఇప్పుడు రవి బస్రూర్.. వీర చంద్ర హాస టైటిల్ తో ఓ మూవీని తెరకెక్కించారు. గత శుక్రవారం కర్ణాటకలోని థియేటర్లలో విడుదలైన ఆ సినిమా.. ఇప్పుడు దూసుకుపోతోంది. పాజిటివ్ టాక్ అందుకుని మంచి వసూళ్లు రాబడుతోంది. యక్షగానం నేపథ్యంతో రూపొందిన వీరచంద్రహాస.. ఇప్పుడు మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని వినికిడి.
అయితే యక్షగానం అంటే మన దగ్గర ప్రెజెంట్ జెనరేషన్ కు తెలియదని చెప్పాలి. కానీ కర్ణాటకలో అందరికీ తెలిసే ఉంటుంది. అందుకే దాన్ని బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేసుకుని రవి బస్రూర్ మూవీ చేశారేమో. ఆయనే మ్యూజిక్ కూడా అందించారు. అదే సమయంలో కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ను కూడా రంగంలోకి దించారు.
సినిమాలో ఆయన క్యామియో రోల్ పోషించడం.. మూవీకి ప్లస్ అయిందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు వీరచంద్రహాస డబ్బింగ్ వెర్షన్ తెలుగులో కూడా రిలీజ్ కానుంది. ఏప్రిల్ 25వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు మేకర్స్. అది ఓకే గానీ.. కన్నడ నేటివిటీకు సరిగ్గా సరిపోయిన వీరచంద్రహాస.. తెలుగులో ఎలా మెప్పిస్తుందనేది ఆసక్తికరం.
మహాభారతంలోని అశ్వమేధిక పర్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్న స్టోరీలో డెప్త్ చాలా ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఆ స్టేజ్ డ్రామా కన్నడ సినీ ప్రియులను బాగానే మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా తక్కువ సమయంలోనే మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుుడు తెలుగులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్స్.. దర్శకులుగా మారారని మనం ఎప్పుడూ విని ఉండలేదు. ఇంతవరకు అలా కూడా జరగలేదు. ఇళయరాజా, కీరవాణి, మణిశర్మ, ఏఆర్ రెహమాన్, దేవిశ్రీ ప్రసాద్, తమన్, మిక్కీ జె మేయర్ సహా అనేక మంది ఉన్నా.. ఎవరూ డైరెక్షన్ జోలికి వెళ్లలేదు. ఇప్పుడు రవి బస్రూర్ ట్రెండ్ సెట్ చేశారు. మరి డైరెక్టర్ గా ఎలాంటి విజయాలు అందుకుంటారో వేచి చూడాలి.