రేజర్ టైటిల్ గ్లింప్స్:బ్రూటాలిటీకి పరాకాష్టలా ఉందే!
సరికొత్త కథలతో విభిన్నమైన క్యారెక్టర్లతో సినిమాలు చేస్తూ దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్నారు నటుడు, దర్శకుడు రవిబాబు. నటుడిగా, దర్శకుడిగా కొంత విరామం తీసుకున్న రవిబాబు మళ్లీ ఓ క్రేజీ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
By: Tupaki Desk | 24 Dec 2025 11:28 AM ISTసరికొత్త కథలతో విభిన్నమైన క్యారెక్టర్లతో సినిమాలు చేస్తూ దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్నారు నటుడు, దర్శకుడు రవిబాబు. నటుడిగా, దర్శకుడిగా కొంత విరామం తీసుకున్న రవిబాబు మళ్లీ ఓ క్రేజీ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇంత వరకు కామెడీ, లవ్‌స్టోరీస్, హారర్ థ్రిల్లర్స్‌ని రూపొందించిన రవిబాబు ఈ సారి తన పంథా మార్చి అత్యంత క్రూరమైన యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల్ని వణికించబోతున్నాడు. తనే నటిస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు.
అత్యంత క్రూరమైన డార్క్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి `రేజర్` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ బుధవారం విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ సినీ లవర్స్‌ని షాక్‌కు గురి చేస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీ గ్లింప్స్ స్టార్టింగ్‌లోనే ఇది 18 ప్లస్ వాళ్లకు మాత్రమేనని, వీక్ హార్ట్ ఉన్న వాళ్లకు ఈ కంటెంట్ సూటబుల్ కాదని డిస్‌క్లైమర్ వేసి గ్లింప్స్‌ని స్టార్ట్ చేశారు.
రెండు చేతులు పైకి కట్టేసిన వ్యక్తి ఉన్నట్టుండి కిందపడిపోవడం.. చేతులు కట్ కావడం.. నేలప పడుకుని ఉన్న వ్యక్తిని మరో వ్యక్తి తన్నితే సగ భాగం విడిపోయి బ్లడ్ కారడం...ఎడమ చేతితో ఓ వ్యక్తి తల పట్టుకుంటే తల చేతిలోనే ఉండి బాడీ మొత్తం కట్ అయి నేపై పడిపోవడం... ఓళ్లు గగుర్పోడుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే రక్త పాతం నేపథ్యంలో రూపొందిన సినిమాలకు ఇది పరాకాష్టలా ఉంది. అంతే కాకుండా బ్రూటాలిటీకి పతాక స్థాయిలో ఉండటంతో అంతా షాక్‌కు గురవుతున్నారు.
ఇందులోని కీలక పాత్రలో రవిబాబు నటిస్తున్నాడు. తనే ఈ హత్యలు చేస్తున్నట్టుగా టైటిల్ గ్లింప్స్‌లో చూపించడం..గ్లింప్స్ రిలీజ్‌కు ముందు చెవిని కోసి బ్లడ్ కారుతుండా దాన్నిగాజు టీ గ్లాస్‌లో పెట్టిన స్టిల్ `రేజర్` మూవీని రవిబాబు ఎంత హింసాత్మకంగా తెరకెక్కిస్తున్నాడో స్పష్టమైంది. గ్లింప్స్ వీడియోతో పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. గ్లింప్సే ఇంత హింసాత్మకంగా ఉంటే సినిమా అంతా ఏరేంజ్‌లో హింసతో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
గ్లింప్స్‌లో రౌడీలని ఎలాంటి కనికరం లేకుండా రవిబాబు పార్ట్‌లు పార్ట్‌లుగా నరికి చంపడం వంటి సన్నివేశాలు సినిమాపై అంచనాల్ని, మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కి చేరకుంది. రవిబాబు మెయిన్ లీడ్ రోల్ గురించి తప్ప ఇతర క్యారెక్టర్లు, టెక్నీషియన్‌ల గురించి ఇప్పటి వరకు వెల్లడించని మేకర్స్ త్వరలోనే పూర్తి క్రూకు సంబంధించిన వివరాల్ని వెల్లడించనున్నారట. రవిబాబు ఫస్ట్ టైమ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో చేస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
