Begin typing your search above and press return to search.

ఫ్యామిలీతో జ‌పాన్ లో ర‌వితేజ..ఏంటి స‌ర్ ప్రైజ్!

'టోక్యోలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అన్నట్టు…బట్ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ’ అంటూ రవితేజ చమత్క రించాడు.

By:  Tupaki Desk   |   2 Sep 2023 6:33 AM GMT
ఫ్యామిలీతో జ‌పాన్ లో  ర‌వితేజ..ఏంటి స‌ర్ ప్రైజ్!
X

మాస్ రాజా ర‌వితేజ ఫ్యామిలీ ఫోటోలు చాలా రేర్ గా బ‌య‌ట‌కొస్తుంటాయి. ఆయ‌న కుమార్తె-కుమారుడు కూడా చాలా అరుదుగానే సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తుంటారు. ఆయ‌న భార్య క‌ళ్యాణి తేజ‌...ఇత‌ర మెంబ‌ర్స్ ఎవ్వ‌రూ పెద్ద‌గా మీడియా కంట ప‌డ‌రు. ర‌వితేజ న‌టించిన సినిమా ఈవెంట్ల స‌మ‌యంలో కూడా క‌నిపించ‌రు. సాధార‌ణంగా హీరోలంతా త‌మ ఫ్యామిలీ మెంబ‌ర్స్ ని వేడుక‌ల‌కు తీసుకొస్తుంటారు. కానీ రాజా మాత్రం ఫ్యామిలీని సినిమా ప్ర‌పంచానికి చాలా దూరంగా ఉంచుతారు.


కెరీర్ ఆరంభం నుంచి ఆయ‌న ఇదే విధానంలో కొన‌సాగుతున్నారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో కాస్త పంథా మార్చారు. తాజాగా ర‌వితేజ ఫ్యామిలీతో జపాన్ కి వెకేష‌న్ కి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. కుటుంబంతో సెల్పీలు దిగిన కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియా లో షేర చేసారు. అందులో రవితేజ కొడుకు మహదాన్, మోక్షదలతో పాటు రవితేజ తమ్ముడి కుమారుడు కూడా ఉన్నాడు. ఆ ఫోటో బ్యాక్ గ్రౌండ్ కి రవితేజ తనదైన శైలిలో కామెంట్ పోస్ట్ చేసాడు.

'టోక్యోలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అన్నట్టు…బట్ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ’ అంటూ రవితేజ చమత్క రించాడు. ఇలా ఫ్యామిలీతో ర‌వితేజ సోష‌ల్ మీడియాలో ఫోటో షేర్ చేయ‌డం ఇదే తొలిసారి అయిండొచ్చు. గ‌తంలో ఎప్పుడూ ఇలాంటి ఫోటోలో పోస్ట్ చేయ‌లేదు. దీంతో ఫ్యామిలీ ప‌రంగా లైఫ్ స్టైల్ కూడా మార్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ మ‌ధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఫ్యామిలీతో విదేశాల‌కు వెళ్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అన్న‌య్య త‌ర‌హాలోనే త‌మ్ముడు కూడా కొత్త జ‌ర్నీ మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

రవితేజ సినిమాల సంగ‌తి చూస్తే ప్ర‌స్తుతం రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. అందులో ఒకటి పాన్ ఇండియా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు.. ఈ చిత్రం 'దసరా కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే 'ఈగల్' అనే మరో చిత్రంలో కూడా నటిస్తున్నాడు.