Begin typing your search above and press return to search.

బిగ్‌బాస్ 7 : ప్రశాంత్ కి షాక్ ఇచ్చిన రతిక

అప్పుడు రతిక స్పందిస్తూ కుక్కలా తిరిగి కష్టపడి అవకాశం దక్కించుకున్న నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటూ ప్రశ్నించింది.

By:  Tupaki Desk   |   13 Sep 2023 5:27 AM GMT
బిగ్‌బాస్ 7 : ప్రశాంత్ కి షాక్ ఇచ్చిన రతిక
X

బిగ్ బాస్ అన్ని సీజన్ లలో కూడా సోమవారం ఎపిసోడ్‌ ప్రతి సారి కూడా రసవత్తరంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఎప్పటిలాగే ఈ వారం ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియ కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ వారం అంతా కలిసి పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేసినట్లుగా అనిపించింది. అతడి ప్రవర్తన విషయంలో చాలా మంది విమర్శలు చేశారు.

ముఖ్యంగా అమర్ దీప్ ఓ రేంజ్ లో ప్రశాంత్‌ పై విమర్శలు చేస్తూ నామినేట్‌ చేయడం జరిగింది. ఇక గౌతమ్ కూడా పల్లవి ప్రశాంత్ విషయం లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ నామినేట్‌ చేశాడు. బిగ్ బాస్ హౌస్ లోకి రావడం కోసం నటించాడు ప్రశాంత్ అంటూ వారు ఆరోపించారు.

ఆ సమయంలో పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ ఇన్నాళ్లు అన్నపూర్ణ స్టూడియో చుట్టు కుక్కలా తిరిగాను అన్నాడు. అప్పుడు రతిక స్పందిస్తూ కుక్కలా తిరిగి కష్టపడి అవకాశం దక్కించుకున్న నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటూ ప్రశ్నించింది. దాంతో ఆమె ప్రశ్నకు పల్లవి ప్రశాంత్ షాక్ అయ్యాడు. ఆమె ఇన్ని రోజులు పల్లవి ప్రశాంత్ ను రొమాన్స్ పేరుతో ప్రోత్సహించింది.

ఇప్పుడు ఆ మాట మాట్లాడటంతో ప్రశాంత్‌ మాత్రమే కాకుండా అంతా కూడా అవాక్కయ్యారు. ఇదెక్కడి మాస్ రా మావ అన్నట్లుగా ప్రశాంత్‌ ప్రవర్తించాడు. మొత్తానికి ఎపిసోడ్‌ మొత్తం రసవత్తరంగా సాగింది. పల్లవి ప్రశాంత్ విషయం లో కొందరు జాలి చూపిస్తే కొందరు మాత్రం జరగాల్సిందే జరిగింది అన్నట్లుగా సోషల్‌ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.