Begin typing your search above and press return to search.

రతికతో బ్రేకప్.. రాహుల్ నిజంగానే అలా ఫిక్స్ అయ్యాడా..?

అయితే రాహుల్ రతిక లవ్ స్టోరీ గురించి రతిక సోదరి కొన్ని కామెంట్స్ చేసింది. రాహుల్ రతిక కొన్నాళ్ల క్రితం ప్రేమించుకున్నారని వారి ప్రేమకు పెద్దల అంగీకారం కూడా వచ్చిందని అన్నారు.

By:  Tupaki Desk   |   4 Nov 2023 2:25 PM GMT
రతికతో బ్రేకప్.. రాహుల్ నిజంగానే అలా ఫిక్స్ అయ్యాడా..?
X

బిగ్ బాస్ లోకి రాకముందు అంతగా పరిచయం లేని వాళ్లు కూడా బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అవుతారు. ఈ లిస్ట్ లో చాలామంది పేర్లు ఉండగా లేటెస్ట్ గా రతిక రోజ్ పేరు బాగా వినిపిస్తుంది. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గానే కాదు పటాస్ లాంటి షోలో స్టాండింగ్ కమెడియన్ గా ట్రై చేసిన రతిక రోజ్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక తెలిసింది ఆమె రాహుల్ సిప్లిగంజ్ మాజీ లవర్ అని. రాహుల్ తో బ్రేకప్ గురించి ఇన్ డైరెక్ట్ గా హింట్లు ఇవ్వడం రతిక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే రాహుల్ తో దిగిన ఫోటోలు లీక్ అవ్వడం చూసి ఇదంతా ప్లానింగ్ ప్రకారమే చేశారని తెలిసిపోయింది.

రాహుల్ సిప్లిగంజ్ కూడా ఎప్పుడో ఆరేళ్ల క్రితం జరిగిన దాని గురించి ఇప్పటికీ బాధపడుతున్నారా.. హౌస్ లో తన పేరును వాడుకుని ఆడుతున్నారని డైరెక్ట్ గా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టాడు. ఆల్రెడీ బిగ్ బాస్ విన్నర్ సింగర్ గా సూపర్ ఫాం లో ఉన్న రాహుల్ ఒక్క మెసేజ్ తో రతిక మీద పగబట్టిన అతని ఫ్యాన్స్ రతికని బయటకు పంపించేశారు. అయితే బిగ్ బాస్ 7 లోకి మళ్లీ రతిక రీ ఎంట్రీ ఇచ్చింది.

అయితే రాహుల్ రతిక లవ్ స్టోరీ గురించి రతిక సోదరి కొన్ని కామెంట్స్ చేసింది. రాహుల్ రతిక కొన్నాళ్ల క్రితం ప్రేమించుకున్నారని వారి ప్రేమకు పెద్దల అంగీకారం కూడా వచ్చిందని అన్నారు. అయితే పెళ్లి తర్వాత రతిక సినిమాలు చేయకూడదు అనే కండీషన్ పెట్టడం వల్ల రతిక రాహుల్ తో బ్రేకప్ చేసుకుందని చెప్పారు. అయితే వారి ప్రేమకు ఫ్యామిలీ మెంబర్స్ ఓకే అంటారని కూడా వారు ఊహించలేదని రతిక సిస్టర్ చెప్పారు. రతిక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు రాహుల్ తో దిగిన ఫోటోలు ఎలా బయటకు వచ్చాయో తనకు తెలియదని అన్నారు.

రాహుల్ సంగతి వదిలి పెట్టి బిగ్ బాస్ హౌస్ లో రతిక తన ఆట ఆడితే అప్పుడే ఎలిమినేట్ అయ్యేది కాదని అన్నది. రీ ఎంట్రీ తర్వాత రతిక ఆట ఇంకా మొదలు పెట్టలేదు ఆమె ఆట మొదలు పెడితే చూడాలని బిగ్ బాస్ ఆడియన్స్ అనుకుంటున్నారు. బిగ్ బాస్ రతికని హౌస్ లోకి మళ్లీ పంపించడం వల్ల ఆమెకు మరో గొప్ప అవకాశం వచ్చినట్టే అని చెప్పొచ్చు. రతిక తన మీద ఉన్న నెగిటివిటీని తన ఆటతో పోగొట్టుకుంటుందా లేదా అన్నది చూడాలి.