Begin typing your search above and press return to search.

భగవంత్ కేసరిలో బిగ్ బాస్ పాప​.. థియేటర్లు గోల గోల

ఈ సినిమాలో రతిక ఒక మహిళా మంత్రి పాత్రలో కనిపించింది. ఇంగ్లీష్​లో మాట్లాడే మంత్రిగా నవ్వులు పూయించిందట.

By:  Tupaki Desk   |   19 Oct 2023 12:00 PM GMT
భగవంత్ కేసరిలో బిగ్ బాస్ పాప​.. థియేటర్లు గోల గోల
X

స్టార్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ నటించిన‌ భగవంత్ కేసరి.. దసరా సంధర్భంగా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలి షో నుంచే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల కీలక పాత్రల్లో నటించారు. వీళ్ల స్క్రీన్ ప్రెజెన్స్​ ఆడియెన్స్​కు బాగా కనెక్ట్ అయింది.

అయితే వీళ్లతో పాటు ఇప్పటివరకు ప్రచారంలో లేని మరో పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అది మరెవరో కాదు నటించింది.. తెలుగు అమ్మాయి, బిగ్‌బాస్ బ్యూటీ రతికా రోజ్. ఈ సినిమాలో రతిక ఒక మహిళా మంత్రి పాత్రలో కనిపించింది. ఇంగ్లీష్​లో మాట్లాడే మంత్రిగా నవ్వులు పూయించిందట.

అసలు ఆమె చిత్రంలో ఉన్నట్టు రిలీజ్ అయ్యేంతవరకు ఎవరికీ తెలీదు. ఊహించని విధంగా ఇప్పుడు అకస్మాతుగా ఆమెను స్క్రీన్​పై చూసి ప్రేక్షకులు థియేటర్​లో అరిచి గోల చేస్తున్నారు. వాస్తవానికి ఈ బ్యూటీ నటించింది చిన్న పాత్రే అయినప్పటికీ.. రతికకు ఇలాంటి సమయంలో స్క్రీన్​పై కనిపించడం మంచి ఛాన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ఒకవేళ బిగ్ బాస్ హౌజ్​లోకి వెళ్లక పోయి ఉంటే మాత్రం... ఆమెను ఎవరూ గుర్తు పట్టేవారు కూడా కాదు. బిగ్​బాస్​ హౌజ్​తోనే ఆమెకు ఈ గుర్తింపు తెచ్చింది. అందుకే జనాలు. ఆమెను ఇట్టే గుర్తు పెట్టేస్తున్నారు

ఇకపోతే బిగ్ బాస్ 7 హౌస్ లోకి వచ్చిన నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయింది రతిక. హౌజ్​లో మెదట్లో ఫుల్ యాక్టివ్​గా ఉండి.. గేమ్‌లు, టాస్క్‌లు బాగానే ఆడేది. కానీ ఆ తర్వాత మాజీ బాయ్​ఫ్రెండ్​ సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్​తో దిగిన ఫోటోలు బయటకు రావడం, వాటిని సింపతీకి వాడుకోవడం వంటివి చేసింది.

హౌజ్​లోనూ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో ముందు ప్రేమాయణం నడపడం, ఆ తర్వాత అతడితో మాటల యుద్ధం నడపడం, అనంతరం యావర్‌ విషయంలోనూ ఇదే జరగడం.. వంటి సంఘటనలు ఆమెపై తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె ఎలిమినేట్​ అయిపోయింది.