ఆ ఛాయాగ్రాహకుడి సతమణీ అందరకీ తెలిసిన నటే!
తాజాగా ఆ విషయాలు కొన్ని తెలుస్తున్నాయి. ఆయన ప్రేమించి పెళ్లి చేసుకుంది నటి జాహ్నవి. అప్పట్లో జాహ్నవి చాలా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసింది.
By: Tupaki Desk | 28 Jun 2025 2:00 AM ISTసీనియర్ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ గురించి పరిచయం అవసరం లేదు. 'గాయం', 'చిత్రం', 'నువ్వు నేను', 'గులాబీ', 'కిక్' ఇలా ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించారు. ఛాయాగ్రాహకుడిగా ఆయన కంటూ ఓ ఇమేజ్ ఉంది. అంతే కాదు కొన్ని సినిమాలను కూడా డైరెక్ట్ చేసారు. 'ఒకరికొకరు', 'సంగమం', 'భగీరధ' లాంటి చిత్రాలకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ కూడా అయ్యారు. అయితే ఆయన ఫ్యామిలీ విషయాలు మాత్రం ఇంత వరకూ ఎక్కడా బయటకు రాలేదు.
తాజాగా ఆ విషయాలు కొన్ని తెలుస్తున్నాయి. ఆయన ప్రేమించి పెళ్లి చేసుకుంది నటి జాహ్నవి. అప్పట్లో జాహ్నవి చాలా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసింది. హీరోయిన్ ప్రెండ్ పాత్రల్లో ఆమె అప్పట్లో చాలా ఫేమస్. 'యజ్ఞం',' హ్యాపీ' చిత్రాల్లో హీరోయిన్ స్నేహితురాలి రోల్ అయినా ఎంతో కీలకమైనది. అయి తే పెళ్లి తర్వాత జాహ్నవి సినిమాలకు దూరమైంది. తాజాగా ఆమెతో పరిచయం ప్రేమ, పెళ్లి గురించి రసూల్ ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేసారు.
'ఒకరికొకరు' సినిమా టైమ్ లోనే ఇద్దరం కలిసాం. ఆ వెంటనే ప్రేమ పెళ్లి అన్ని జరిగిపోయాయి. పెళ్లి తర్వాత సినిమాలు మానేసింది. అందుకు కారణాలంటూ ఏవీ లేవు. ఇద్దరం కలిసి మాట్లాడుకున్న తర్వాతే సినిమాలకు దూరమైంది. కానీ జాహ్నవి తలుచుకుంటే మంచి దర్శకురాలు కాగలదు. కానీ ఎందుకనో అటు వైపుగా దృష్టి పెట్టలేదు' అని తెలిపారు. ప్రస్తుతం రసూల్ మాత్రం టెక్నిషీయన్ గా బిజీగా ఉన్నారు.
రసూల్ ఎల్లోర్ ఈ పేరు చూసి ఈయన తమిళీయన్, హిందీ పరిశ్రమలకు చెందిన వారని అనుకుంటారు. కానీ రసూల్ తెలుగువారు. రాజమండ్రిలో నే పుట్టి పెరిగారు. తెలుగులో పాటు హిందీ సినిమాలకు కూడా పనిచేసారు. 'జునూన్', 'ప్యార్ కియాతో డర్నా క్యా' చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసారు. అలాగే రెండు ఇంగ్లీష్ సినిమాలకు పనిచేసారు. 'క్రోకొడాయిల్-2 :డెత్ స్వాప్', 'ప్యానిక్' చిత్రాలకు హాలీవుడ్ లోనూ సత్తా చాటారు.
