Begin typing your search above and press return to search.

హాస్టల్ బాయ్స్ రష్మికి బాగానే ముట్టచెప్పారా..?

ఈ సినిమా కోసం రష్మికి హాస్టల్ బాయ్స్ నిర్మాతలు భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. హాస్టల్ బాయ్స్ లో రష్మి గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుందట.

By:  Tupaki Desk   |   25 Aug 2023 9:56 AM GMT
హాస్టల్ బాయ్స్ రష్మికి బాగానే ముట్టచెప్పారా..?
X

కన్నడలో సూపర్ హిట్ అయిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ హాస్టల్ హుడుగారు బకాడిదరే సినిమాను తెలుగు ప్రేక్షకులకు ముందుకు తెస్తున్నారు. ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ చాయ్ బిస్కెట్ నిర్మాతలు రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో హాస్టల్ బాయ్స్ పేరుతో ఈ సినిమా వస్తుంది. శనివారం రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రీమియర్స్ ఈరోజు సెలెక్ట్ చేసిన ఏరియాల్లో ప్లాన్ చేశారు. హాస్టల్ బాయ్స్ సినిమా తెలుగు వెర్షన్ లో జబర్దస్త్ రష్మిని యాడ్ చేశారు.

కన్నడలో కాలేజ్ టీచర్ రోల్ లో అక్కడ ఒక యాక్ట్రెస్ నటించగా ఆ సీన్స్ తీసేసి తెలుగులో రష్మి సీన్స్ యాడ్ చేసినట్టు తెలుస్తుంది. రష్మి సీన్స్ వల్ల తెలుగులో హాస్టల్ బాయ్స్ కి మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం రష్మికి హాస్టల్ బాయ్స్ నిర్మాతలు భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. హాస్టల్ బాయ్స్ లో రష్మి గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుందట. అయితే సినిమాలో రష్మి వల్ల బిజినెస్ జరుగుతుందని తెలిసే ఆమెను తీసుకున్నారు.

అందుకే రష్మి కూడా ఈ సినిమాలో నటించేందుకు పారితోషికం బాగానే పుచ్చుకుందని తెలుస్తుంది. రెగ్యులర్ గా తను తీసుకునే రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ ఈ హాస్టల్ బాయ్స్ సినిమాకు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఓ పక్క జబర్దస్త్ షోలో యాంకర్ గా చేస్తూనే మరోపక్క సినిమాలు కూడా చేస్తూ వస్తుంది రష్మి గౌతం. గుంటూరు టాకీస్ సినిమాతో హాట్ ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మి ఆమధ్య కాలంలో అన్నీ అదే టైప్ పాత్రల్లో నటించి మెప్పించింది.

కొద్దికాలం పాటుగా సరైన పాత్రలు రాక సినిమాలకు దూరంగా ఉన్న రష్మి మళ్లీ హాస్టల్ బాయ్స్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. హాస్టల్ బాయ్స్ లో నటీనటులంతా కూడా కన్నడ వాళ్లే కాంతార రిషబ్ శెట్టి కేమియో సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. ఆల్రెడీ కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా అదే ఫలితాన్ని అందుకుంటుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. ఈమధ్య కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమా అయినా సరే హిట్ చేస్తున్నారు ఆడియన్స్. అందులోనూ తెలుగు ప్రేక్షకులు అయితే వారికి నచ్చేలా ఉంటే అది ఎవరి సినిమా అయినా హిట్ చేస్తారు. రీసెంట్ గా వచ్చిన బేబీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ కాగా అదే యూత్ టార్గెట్ తో వస్తున్న హాస్టల్ బాయ్స్ కూడా వర్క్ అవుట్ అవుతుందేమో చూడాలి.