Begin typing your search above and press return to search.

విజయ్ కోసం రష్మిక ఎప్పుడు రెడీనే..!

ఇక ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ లేకపోయినా విజయ్ 12వ సినిమా గౌతం తిన్ననూరి సినిమాలో రష్మికతో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

By:  Tupaki Desk   |   16 Jan 2024 2:30 AM GMT
విజయ్ కోసం రష్మిక ఎప్పుడు రెడీనే..!
X

హీరో హీరోయిన్ కాస్త క్లోజ్ గా ఉంటే చాలు వాళ్లిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని మీడియా కోడై కూస్తుంది. వాటిని నిజం చేస్తూ కొందరు వారి రిలేషన్ ని ఓపెన్ అయితే.. మీడియా మా గురించి రాసిందంత ట్రాషే అంటూ కొందరు సమాధానం ఇస్తారు. అయితే అటు మీడియా వార్తలకు రెస్పాండ్ అవ్వకుండా.. వాటిని నిజం కాకుండా వస్తున్న జోడీ విజయ్ దేవరకొండ రష్మిక. గీతా గోవిందంతో జత కట్టి హిట్ కాంబో అనిపించుకున్న ఈ జోడీ ఆ తర్వాత డియర్ కామ్రేడ్ కలిసి చేసినా అది వర్క్ అవుట్ కాలేదు. మళ్లీ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నదు లేదు కానీ వీళ్లిద్దరి ఫ్రెండ్ షిప్ మాత్రం ఒక రేంజ్ లో కొనసాగుతుంది.

విజయ్ దేవరకొండ ఎక్కడ ఉంటే రష్మిక అన్నట్టుగా పరిస్థితులు కనబడుతున్నాయి. ఇద్దరు కలిసి వెకేషన్ కి టూర్లు వెళ్లడం.. కలిసి ఫెస్టివల్స్ ని సెలబ్రేట్ చేసుకోవడం ఇలా అన్ని కలిసి చేస్తారు. కానీ మీడియా దృష్టిలో పడితే మాత్రం తూచ్ మేమిద్దరం మంచి స్నేహితులమే అంటారు. కెరీర్ పరంగా చూస్తే రష్మిక బాలీవుడ్ టాలీవుడ్ అనే విధంగా దూసుకెళ్తుంటే విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు.

విజయ్ రష్మిక ఇద్దరిని మళ్లీ కలిసి తెర మీద చూడాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. కానీ ఆ ఛాన్స్ మాత్రం రావట్లేదు. విజయ్ ప్రస్తుతం చేస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆ సినిమాలో రష్మిక ఒక స్పెషల్ సాంగ్ చేస్తుందని అన్నారు. కానీ తెలుస్తున్న విషయం ఏంటంటే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లో రష్మిక సాంగ్ లేదన్నది తెలుస్తుంది.

ఇక ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ లేకపోయినా విజయ్ 12వ సినిమా గౌతం తిన్ననూరి సినిమాలో రష్మికతో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్యాని ఫిక్స్ చేశారు. సినిమాలో అదనపు ఆకర్షణ కోసం రష్మిక మందన్న చేత స్పెషల్ సాంగ్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారట. తప్పకుండా రష్మిక ఈ సినిమాకు భారీ హైప్ తీసుకురావడంలో సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. రష్మిక మందన్న విజయ్ కాంబో తెర మీద కనిపిస్తే చాలు అనుకుంటున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మరి ఈ స్పెషల్ సాంగ్ అప్డేట్ బయటకు రావాల్సి ఉంది.