Begin typing your search above and press return to search.

రష్మిక మందన్న.. స్టైలిష్ గ్లామర్ ఎటాక్

గ్రే కలర్ సింపుల్ డ్రెస్ లో రష్మిక దిగిన ఫొటోలను ఆమె మేకమ్ మ్యాన్ షేర్ చేశారు. కొంటె చూపులతో ఆకట్టుకుంటోంది రష్మిక. తన లుక్స్ తో నెటిజన్లను ఫిదా చేసేస్తోంది.

By:  Tupaki Desk   |   28 Feb 2024 11:32 AM GMT
రష్మిక మందన్న.. స్టైలిష్ గ్లామర్ ఎటాక్
X

సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. వరుసగా షూటింగ్ షెడ్యూల్స్ లో పాల్గొంటోంది. తక్కువ టైమ్ లోనే ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు.. స్టార్ హీరోలందరితో జతకట్టింది. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. తక్కువ చిత్రాలతోనే స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈ బ్యూటీ.. నార్త్ టు సౌత్ భారీగా ఫ్యాన్స్ ను సంపాదించుకుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో నేషనల్ క్రష్ గా మారిపోయిన రష్మిక.. ఇటీవల సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ దక్కించుకుంది. తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. గీతాంజలి పాత్రలో నటించి బాక్సాఫీస్ ను కుదిపేసింది. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

మరోవైపు, సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. రోజురోజుకూ ఫాలోవర్స్ ను ఓ రేంజ్ లో పెంచుకుంటోంది. పర్సనల్ అప్డేట్స్ తోపాటు కెరీర్ విషయాలను షేర్ చేసుకుంటూ అభిమానులను పలకరిస్తుంటోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫొటోషూట్స్ షేర్ చేస్తుంటోంది. చీరలతోపాటు ట్రెండీ ఔట్ ఫిట్స్ లో కూడా అందాలు ఆరబోసి సందడి చేస్తుంటోంది.

అయితే అందరి హీరోయిన్ల లానే వివిధ బ్రాండ్ ప్రమోషన్లు కూడా చేస్తోంది రష్మిక. అందులో భాగంగా ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్న పిక్స్.. ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. గ్రే కలర్ సింపుల్ డ్రెస్ లో రష్మిక దిగిన ఫొటోలను ఆమె మేకమ్ మ్యాన్ షేర్ చేశారు. కొంటె చూపులతో ఆకట్టుకుంటోంది రష్మిక. తన లుక్స్ తో నెటిజన్లను ఫిదా చేసేస్తోంది. నేషనల్ క్రష్ సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్.

ప్రస్తుతం రష్మిక పుష్ప-2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఆగస్టు 15వ తేదీన మరోసారి శ్రీవల్లిగా థియేటర్లలో సందడి చేయనుంది. అయితే శ్రీవల్లి పాత్ర ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతోపాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బోలో నటిస్తోంది. మరోవైపు, బాలీవుడ్ మూవీ చావాలో యాక్ట్ చేస్తోంది. మరి రష్మిక.. ఎలాంటి హిట్లు కొడుతుందో వేచి చూడాలి.