Begin typing your search above and press return to search.

రష్మిక బాయ్ ఫ్రెండ్ దొరికేశాడు

ఈ మూవీలో రష్మిక బాయ్ ఫ్రెండ్ గా హీరో దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. ఇటీవలే ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అతడి గ్లింప్స్ ను విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   24 Dec 2023 7:37 AM GMT
రష్మిక బాయ్ ఫ్రెండ్ దొరికేశాడు
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ కొట్టేసిన ఈ భామ.. ఇటీవల యానిమల్ సినిమాతో మరోసారి అలరించింది. ఈ సినిమా విడుదలై 23రోజులు అవుతున్నా.. ఇంకా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఆమె గర్ల్ఫ్రెండ్ మూవీలో నటిస్తోంది.

అయితే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ వివరాలను బయటపెట్టింది రష్మిక. నేషనల్ క్రష్ కు బాయ్ ఫ్రెండ్ ఆ? మళ్లీ ఎప్పుడు ప్రేమలో పడిందని ఆశ్చర్యపోతున్నారా? నోనో.. ఇది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో భాగమే. ఈ మూవీలో రష్మిక బాయ్ ఫ్రెండ్ గా హీరో దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. ఇటీవలే ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అతడి గ్లింప్స్ ను విడుదల చేశారు. గర్ల్ ఫ్రెండ్ కు తగిన బాయ్ ఫ్రెండ్ ఇతడే అంటూ పరిచయం చేశారు.

వీడియోలో విక్రమ్ గురించి రష్మిక తన మాటల్లో చెప్తుండగా మరోవైపు అగ్రెసివ్ గా ఉన్న దీక్షిత్ శెట్టిని చూపించారు మేకర్స్. బళ్లారి అబ్బాయి.. విక్కీనే మా కాలేజ్ టీమ్ విరాట్ కోహ్లీ.. విక్కీ నవ్వితే చాలు కాలేజీ అమ్మాయిలంతా ఫ్లాట్ అంటూ రష్మిక చెబుతున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది రిలీజ్ కానుంది ఈ మూవీ. ప్రస్తుతం రష్మిక బాయ్ ఫ్రెండ్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కిర్రాక్ పార్టీ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ రష్మిక ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో కూడా పడింది. ఎంగేజ్ మెంట్ వరకు వెళ్లిన వీరి ప్రేమ.. పెళ్లి పీటలు ఎక్కేముందు బ్రేకప్ అయింది. ఆ తర్వాత శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్ కు షిఫ్ట్ అయింది ఈ బ్యూటీ. తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ఛలోతో ఎంట్రీ ఇచ్చి తన ఖాతాలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను వేసుకుంది. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో కేజ్ కొట్టేసింది ఈ బ్యూటీ. తాజాగా రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాతో మరోసారి అదరగొట్టింది. గీతాంజలి అనే పాత్రలో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా అయ్యాక హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యి షూటింగ్స్ లో బిజీబిజీగా గడుపుతోంది.