Begin typing your search above and press return to search.

రష్మిక రూలింగ్ ఆన్ బాలీవుడ్..!

కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి తెలుగులో స్టార్ గా ఎదిగిన హీరోయిన్ రష్మిక మందన్న. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక తన కెరీర్ లో కూడా చెలరేగిపోతుంది.

By:  Tupaki Desk   |   20 Jan 2024 2:30 PM GMT
రష్మిక రూలింగ్ ఆన్ బాలీవుడ్..!
X

కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి తెలుగులో స్టార్ గా ఎదిగిన హీరోయిన్ రష్మిక మందన్న. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక తన కెరీర్ లో కూడా చెలరేగిపోతుంది. తన టాలెంట్ తో టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన అమ్మడు చిన్నగా బాలీవుడ్ వైపు వెళ్లింది. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అక్కడ ఇక్కడ సినిమాలతో అలరిస్తుంది. అయితే బాలీవుడ్ లో ఎంట్రీ సినిమా నిరాశపరిచినా పుష్ప 1 తో హిందీలో కూడా క్రేజ్ తెచ్చుకుంది రష్మిక.

ఇక లాస్ట్ ఇయర్ చివర్లో వచ్చిన యానిమల్ సినిమా రష్మిక క్రేజ్ అమాంతం పెంచేసింది. సందీప్ వంగ డైరెక్షన్ లో తెరకెక్కిన యానిమల్ సినిమాతో బాలీవుడ్ అంతా షాక్ అయ్యింది. రణ్ బీర్ కపూర్ ని ఇదివరకు ఎప్పుడు చూడని పాత్రలో ప్రాజెక్ట్ చేసిన సందీప్ వంగ రష్మికని కూడా తన పాత్రతో మెప్పించేలా చేశాడు. యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రలో ఆకట్టుకుంది రష్మిక.

యానిమల్ హిట్ తో బాలీవుడ్ లో తన పేరు మారు మోగేలా చేసుకుంటున్న రష్మిక రాబోతున్న పుష్ప 2తో కూడా మరోసారి పాన్ ఇండియా హిట్ టార్గెట్ పెట్టుకుంది. పుష్ప లో శ్రీవల్లి పాత్రలో తన టాలెంట్ చూపించిన రష్మిక ఆ సినిమాతో కూడా బీ టౌన్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసింది. సినిమాలో ఆమె పాత్రకు హిందీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు పుష్ప 2లో కూడా శ్రీవల్లి అలరించనుంది.

ఇదే కాకుండా గర్ల్ ఫ్రెండ్ అంటూ మరో సినిమా చేస్తుంది రష్మిక. ప్రస్తుతం అమ్మడికి ఉన్న ఫాలోయింగ్ చూసి ఆ సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొన్నటిదాకా కేవలం సౌత్ లోనే సత్తా చాటిన రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన రూలింగ్ చేయబోతుంది. పుష్ప 2 ఎలాగు భారీ హైప్ తో వస్తుంది. అది కూడా హిట్ పడితే రష్మికకు బాలీవుడ్ లో కూడా తిరుగు ఉండదని చెప్పొచ్చు. ఇచ్చిన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్న కథానాయికగా రష్మిక సూపర్ పాపులర్ అయ్యింది. ఎంపిక చేసిన పాత్రలకు 100కి 100 శాతం అమ్మడు తన అవుట్ పుట్ ఇస్తుంది. అందుకే రష్మికకు వరుస అవకాశాలు వస్తున్నాయి. యానిమల్ హిట్ అమ్మడికి మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.