Begin typing your search above and press return to search.

పెళ్లెప్పుడంటే.. అయిపోయిందంటూ రష్మిక ట్విస్ట్

నరుటో ని తాను ప్రేమిస్తున్నాన ని, అతనితో తనకు ఎప్పుడో పెళ్లి అయిపోయిందని, అతనే తన మనసు లో ఉన్నాడు అంటూ ఆమె చెప్పింది.

By:  Tupaki Desk   |   3 Aug 2023 11:14 AM GMT
పెళ్లెప్పుడంటే.. అయిపోయిందంటూ రష్మిక ట్విస్ట్
X

టాలీవుడ్ హాట్ బ్యూటీల్లో రష్మిక ఒకరు. ఛలో మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ, వరస అవకాశాలు అందుకొని ముందుకు దూసుకుపోతోంది. కాగా, ఈ బ్యూటీ టాలీవుడ్ లోకి అడుగుపెట్టకముందే, కన్నడ హీరో రోహిత్ శెట్టిని ప్రేమించి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ, ఆ తర్వాత పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. అయితే, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ఆమె ప్రేమలో ఉంది అనే ప్రచారం అయితే జరుగుతూ ఉంటుంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

అయితే, తాజాగా ఆమె తన పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అంటూ ఆమె షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఓ వ్యక్తిని తాను ఇష్టపడ్డానని ఆమె చెప్పారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు నరుటో. చిన్న పిల్లలు ఇష్టంగా టీవీలో చూసే క్యారెక్టర్ నరుటో. జపనీస్ వెబ్ సెరిస్ నరుటో లో ప్రధాన పాత్ర అది. ఈ క్యారెక్టర్ కి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. రష్మిక కూడా ఆ క్యారెక్టర్ ని విపరీతంగా అభిమానిస్తోంది. అందుకే, ఆ క్యారెక్టర్ తో తన పెళ్లి అయిపోయిందని సరదాగా చెప్పింది.

నరుటో ని తాను ప్రేమిస్తున్నాన ని, అతనితో తనకు ఎప్పుడో పెళ్లి అయిపోయిందని, అతనే తన మనసు లో ఉన్నాడు అంటూ ఆమె చెప్పింది. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు పైవిధంగా ఆమె సమాధానం ఇవ్వడం విశేషం. ఆమె సమాధానం విని, అక్కడ ఉన్న మీడియా వారితో సహా పక్కనే ఉన్న టైగర్ ష్రాఫ్ కూడా షాకవ్వడం విశేషం.

ఇదిలా ఉండగా, రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లు అర్జున్ సరసన పుష్ప2లో నటిస్తోంది. దీంతో పాటు, నితిన్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ మూవీ నుంచి రష్మిక తప్పుకుంది. అయినా, రష్మిక చేతిలో బాలీవుడ్ లో సినిమాలు ఉన్నాయి.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన రణబీర్ కపూర్ యానిమల్ చిత్రం లో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, ఈ మూవీలో తన పాత్ర కోసం షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ చిత్రాని కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.