Begin typing your search above and press return to search.

విజయ్ మాత్రమే బెస్ట్ ఎందుకో..?

యానిమల్ టీం ని విష్ చేస్తూ విజయ్ దేవరకొండ పెట్టిన మెసేజ్ కి రష్మిక క్రేజీ రెస్పాన్స్ ఇచ్చింది. ఇంతకీ రష్మిక ఏమని రిప్లై ఇచ్చింది అంటే థాంక్యు విజయ్ యు ఆ ది బెస్ట్ అంటూ చాలా ఎస్టి లు పెట్టింది.

By:  Tupaki Desk   |   29 Sep 2023 4:43 AM GMT
విజయ్ మాత్రమే బెస్ట్ ఎందుకో..?
X

రణ్ బీర్ కపూర్ యానిమల్ టీజర్ రిలీజ్ సందర్భంగా టీజర్ చూసి సూపర్ అనేస్తూ తన కామెంట్ పెట్టాడు విజయ్ దేవరకొండ. విషింగ్ మై డార్లింగ్స్ సందీప్ వంగ, రష్మిక అండ్ మై ఫేవరెట్ ఆర్కే (రణ్ బీర్ కపూర్) హ్యాపీ బర్త్ డే అని ఎక్స్ లో కామెంట్ పెట్టాడు విజయ్ దేవరకొండ. యానిమల్ టీం ని విష్ చేస్తూ విజయ్ దేవరకొండ పెట్టిన మెసేజ్ కి రష్మిక క్రేజీ రెస్పాన్స్ ఇచ్చింది. ఇంతకీ రష్మిక ఏమని రిప్లై ఇచ్చింది అంటే థాంక్యు విజయ్ యు ఆ ది బెస్ట్ అంటూ చాలా ఎస్టి లు పెట్టింది.

గీత గోవిందం సినిమాలో విజయ్ రష్మిక కలిసి జత కట్టారు. అప్పటి నుంచి వాళ్లిద్దరు మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇద్దరు కలిసి మరోసారి డియర్ కామ్రేడ్ లో నటించారు. అయితే గీత గోవిందం మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయారు. డియర్ కామ్రేడ్ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. అప్పటి నుంచి విజయ్, రష్మిక కలిసి నటించకపోయినా ఇద్దరు ఆఫ్ స్క్రీన్ క్లోజ్ గా ఉన్నారు.

విజయ్ ఎక్కడ ఉంటే రష్మిక అక్కడే అన్నట్టుగా ఇద్దరు కలిసి వెకేషన్స్ కి వెళ్లడం లాంటివి జరుగుతున్నాయి. వారి మధ్య సంథింగ్ సీక్రెట్ రిలేషన్ ఉందని చెబుతున్నా ఆ విషయంలో మాత్రం వారు ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. టైం దొరికినప్పుడల్లా కూడా విజయ్ మీద రష్మిక.. రష్మిక మీద విజయ్ ఇలా తమ అభిమానాన్ని చూపిస్తుంటారు. విజయ్ ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

విజయ్ గౌతం తిన్ననూరి సినిమాలో శ్రీ లీల ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకోగా ఆమె ప్లేస్ లో ఇప్పుడు రష్మిక వచ్చి చేరిందని టాక్. విజయ్ రష్మికల హ్యాట్రిక్ సినిమా చూడాలని వారిద్దరి ఫ్యాన్స్ కూడా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. పరశురాం సినిమా సంక్రాంతికి టార్గెట్ పెట్టుకున్న విజయ్ గౌతం తిన్ననూరి సినిమాను త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. టాలీవుడ్ లో స్టార్స్ అందరితో నటిస్తున్న రష్మిక విజయ్ ని మాత్రమే బెస్ట్ అని చెప్పడం ఆమెకు అతని మీద ఉన్న ప్రేమని తెలియచేస్తుంది. అయితే ఎన్నాళ్లు ఈ ఇండైరెక్ట్ హింట్లు ఇస్తారు. ఇద్దరి మధ్య ఏముందో చెప్పేస్తే బెటర్ కదా అని చెప్పుకుంటున్నారు.