Begin typing your search above and press return to search.

రష్మిక రెమ్యునరేషన్ లెక్క.. ఆ రేంజ్ లో ఉందా?

బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ బ్యూటీకి నేషనల్ లెవెల్ లో ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 Feb 2024 5:59 AM GMT
రష్మిక రెమ్యునరేషన్ లెక్క.. ఆ రేంజ్ లో ఉందా?
X

సౌత్ సినీ ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. అంతేకాదు ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరు కూడా. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలో అందరినీ ఆకట్టుకుంది. కన్నడ, తెలుగు చిత్రాలలో కెరీర్‌ రాణించిన రష్మిక.. కొద్దికాలంలోనే తమిళం, బాలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించింది.

అల్లు అర్జున్ పుష్పతో నేషనల్ క్రష్ గా మారిపోయిన రష్మిక.. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగులో పుష్ప-2లో నటిస్తోంది. ఈ సినిమాతోపాటు రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో కూడా యాక్ట్ చెస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ బ్యూటీకి నేషనల్ లెవెల్ లో ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే.

యానిమల్ సినిమా కోసం రష్మిక.. భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుందని అప్పట్లో టాక్ వినిపించింది. ఇక లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ గర్ల్ ఫ్రెండ్ మూవీకి గాను రూ.3 కోట్లు అందుకుందట. తాజాగా ఈ బ్యూటీ రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందట. ఓ తెలుగు ప్రాజెక్ట్ కు రూ.4 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందట. ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే హీరోయిన్లు ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తే.. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటుందని సినీ పండితులు చెబుతున్నారు. రష్మికకు ఫుల్ పాపులారిటీ ఉన్నా.. కాస్త రెమ్యునరేషన్ ను తగ్గించుకోవాలని అంటున్నారు. బాలీవుడ్ కన్నా టాలీవుడ్ మేకర్స్ తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీస్తారని, హీరోయిన్లు సహకరించాలని అంటున్నారు.

ఇక సినిమాలే కాకుండా అందరి హీరోయిన్ల లానే.. బ్రాండ్ ప్రమోషన్లు కూడా చేస్తోంది రష్మిక. మోడలింగ్ ద్వారా కూడా డబ్బు సంపాదిస్తోంది. గతేడాది వచ్చిన ఓ నివేదిక ప్రకారం.. రష్మిక నెలకు రూ.70 లక్షలకు పైగా సంపాదిస్తోందట. మొత్తం ఆమె నికర ఆస్తి విలువ రూ.65 కోట్లు ఉంటుందట. మొత్తానికి రష్మిక అటు సినిమాల్లో, ఇటు సంపాదనలో తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది.