Begin typing your search above and press return to search.

వైరల్‌ : పీరియడ్స్‌ పెయిన్‌ పై రష్మిక పోస్ట్‌

ఆడవారు పీరియడ్స్‌ సమయంలో ఎంత ఇబ్బంది పడుతారు అనే విషయం అందరికీ తెల్సిందే.

By:  Tupaki Desk   |   11 March 2024 5:24 AM GMT
వైరల్‌ : పీరియడ్స్‌ పెయిన్‌ పై రష్మిక పోస్ట్‌
X

ఆడవారు పీరియడ్స్‌ సమయంలో ఎంత ఇబ్బంది పడుతారు అనే విషయం అందరికీ తెల్సిందే. అయితే ఆ విషయాన్ని వారు బయటకు చెప్పకుండా తమలోనే ఉంచుకుని వారి పనులు వారు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు పీరియడ్స్ గురించి బాహాటంగా మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు.. కానీ ఇప్పుడు ఆ విషయం చాలా నార్మల్‌ అయ్యింది.


సోషల్‌ మీడియాలో రష్మిక మందన్న ఇటీవల తన పీరియడ్స్ బాధ గురించి షేర్ చేసుకుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తట్టుకోవాలంటే ఏం చేయాలి, ఆ నొప్పి నుంచి కాస్త అయినా ఉపశమనం పొందాలి అంటే ఏం చేయాలి అంటూ నెట్టింట ఒక పోల్‌ ను పెట్టడం ద్వారా తన బాధ ను చెప్పుకొచ్చింది.

1. ఐస్‌ క్రీమ్‌, చాక్లెట్స్ తినాలా? 2. ఎవరినైనా కొట్టాలా? 3, ఏదైనా సినిమా చూడాలా? 4. ఏడుస్తూ కూర్చోవాలా? అంటూ ప్రశ్నించి తనకు ఒక సమాధానం చెప్పండి అంటూ రష్మిక ఇన్ స్టా స్టోరీ లో పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. నెట్టింట ఆమె ఫాలోవర్స్ తోచిన సలహాలు ఇస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ధనుష్‌, శేఖర్‌ కమ్ముల కాంబోలో రూపొందుతున్న సినిమాలో కూడా ఈ అమ్మడు నటిస్తోంది. ఇంకా రెండు లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో ఈ అమ్మడు కనిపించబోతుంది.

యానిమల్‌ సినిమా తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా మారి పోయింది. ఇప్పటికే అక్కడ రెండు మూడు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఒక్క రోజు కూడా తీరిక లేకుండా కష్టపడే రష్మిక పీరియడ్స్ సమయంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతూనే షూటింగ్స్ కు హాజరు అవుతున్నట్లు ఆమె పోస్ట్‌ ను బట్టి అర్థం చేసుకోవచ్చు.