Begin typing your search above and press return to search.

రష్మిక లక్కు.. ఏకంగా షారుక్ తో ఆఫర్!

తాజాగా అయితే, రష్మిక కు బంప్ ఆఫర్ తగిలిందంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల ప్రకారం రష్మిక కు ఏకంగా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ పక్కన నటించే అవకాశం దక్కించుకుందట.

By:  Tupaki Desk   |   5 Aug 2023 11:10 AM IST
రష్మిక లక్కు.. ఏకంగా షారుక్ తో ఆఫర్!
X

నేషనల్ క్రష్ రష్మిక మందనా దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తోంది. వరసగా గుడ్ బై, మిషన్ మజ్నూ వంటి సినిమాల్లో నటించింది. ఆ సినిమాల పై ఎక్కువ ఆశలు పెట్టుకుంది కానీ, పెద్దగా ఫలితం దక్కలేదు. ఈ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయితే.. రెండు వరసగా ప్లాప్ అయినా కూడా ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్లు మాత్రం క్యూ కడుతూ ఉన్నాయి.

తాజాగా అయితే, రష్మిక కు బంప్ ఆఫర్ తగిలిందంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల ప్రకారం రష్మిక కు ఏకంగా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ పక్కన నటించే అవకాశం దక్కించుకుందట. ఇందులో నిజం ఎంత ఉందో తెలీదు కానీ, ప్రచారం ఊపందుకుంది. చాలా మంది నటీమణుల కు షారూక్ నటించడం అనేది చాలా పెద్ద డ్రీమ్. కాగా, ఇలాంటి బంపర్ ఆఫర్ ఇప్పుడు రష్మికకు వచ్చిందని తెలుస్తోంది.

నిజంగా ఈ వార్త నిజం అయితే, రష్మిక నక్కతోక తొక్కినట్లే. షారూక్ తో ఆఫర్ వచ్చి, అది కనుక క్లిక్ అయితే, ఇక, బాలీవుడ్ లో రష్మిక కు తిరుగు ఉండదనే చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే ఈ బ్యూటీకి దక్షిణాదిన ఆఫర్లు తగ్గుతున్నాయి. ఇలాంటి సమయంలో బాలీవుడ్ లో ఆఫర్లు పెరిగడం ఆమె కెరీర్ కి ఉపయోగపడే విషయం అనే చెప్పాలి.

ఇదిలా ఉండగా, ఇప్పటికే రష్మిక చేతి లో కొన్ని సినిమాలు ఉన్నాయి.మరాఠీ యోధుడు, మరాఠీ రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పుడు అలాంటి యుద్ద వీరుడి కోడలిగా నటించబోతుందట రష్మిక. శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ భోంస్లే జీవితం ఆధారంగా.. బాలీవుడ్‌లో ఓ భారీ పీరియాడికల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారట. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశాల్‌ హీరోగా నటించనున్నాడట. శంభాజీ భోంస్లేగా విక్కీ కౌశల్, ఆయన భార్య మహారాణి ఏసుబాయి భోంస్లేగా రష్మికా మందన్నా నటించనున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం.

మరోవైపు , రష్మిక నటించిన పుష్ప2 షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్పతో ఆకట్టుకున్న రష్మిక.. పుష్ప2లో ఆమె క్యారెక్టర్ ఎలా సాగుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.