Begin typing your search above and press return to search.

58 ఏళ్ల న‌టుడితో ర‌ష్మిక రొమాన్స్!

అయితే అమ్మ‌డిప్పుడు తాజా సినిమాతో వాటికి దూరంగా ఉండాల్సి ఉంటుదేమో.

By:  Tupaki Desk   |   9 May 2024 2:30 PM GMT
58 ఏళ్ల  న‌టుడితో ర‌ష్మిక రొమాన్స్!
X

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న అంటే? గుర్తొచ్చేది రొమాంటిక్ చిత్రాలే. `గీత‌గోవిందం` నుంచి మొన్న‌టి `యానిమ‌ల్` వ‌ర‌కూ అమ్మ‌డు ఆ త‌ర‌హా పాత్ర‌ల‌తోనే ఎక్కువ‌గా ఫేమ‌స్ అయింది. అన్నింటికంటే యానిమ‌ల్ అమ్మ‌డి రొమాంటిక్ పెర్పార్మెన్స్ తో మ‌రింత ఫేమ‌స్ అయిపోయింది. అంత‌కు మందు బాలీవుడ్ క‌ల్చ‌ర్ కి త‌గ్గ‌ట్టు త‌న‌ను తాను మార్చుకోవ‌డం...వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ లాంటివి ర‌ష్మిక‌ని మ‌రింత రొమాంటిక్ గా హైలైట్ చేసాయి. ర‌ష్మిక అంటే లిప్ లాక్ లు.. రొమాంటిక్ సీన్లు అంటూ పెద్ద చ‌ర్చే న‌డుస్తుంది.

అయితే అమ్మ‌డిప్పుడు తాజా సినిమాతో వాటికి దూరంగా ఉండాల్సి ఉంటుదేమో. బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ హీరోగా ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `సికంద‌ర్` చిత్రంలో ర‌ష్మిక‌ని హీరోయిన్ గా ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. ఇది ముర‌గ‌దాస్ మార్క్ భారీ యాక్ష‌న్ ఎంట‌న్ టైన‌ర్. స‌ల్మాన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ముర‌గ‌దాస్ టెక్నిక్ ని బేస్ చేసుకుని తెర‌కెక్కిస్తున్నారు. మ‌రి ఇలాంటి క‌థ‌లో ర‌ష్మిక‌-స‌ల్మాన్ మ‌ధ్య రొమాన్స్ కి ఆస్కారం ఉంటుందా? నో ఛాన్స్ అనే చెప్పాలి. ముర‌గ‌దాస్ సినిమాలంటే హీరో-హీరోయిన్ రొమాన్స్ కి ఏమాత్రం ఛాన్స్ ఉండ‌దు.

ఆవిష‌యంలో ముర‌గ‌దాస్ ఎంతో క్లియ‌ర్ అండ్ క్లీన్ గా ఉంటాడు. కంటెంట్ పై ఆధార‌ప‌డ‌తాడు త‌ప్ప‌! రొమాంటిక్ స‌న్నివేశాల‌పై ఆధార‌ప‌డి అత‌ను సినిమాలు చేయ‌డు. ఆర‌కంగా స‌ల్మాన్ -ర‌ష్మిక మ‌ధ్య రొమాన్స్ పాఠాలంటూ ఏవీ ఉండ‌దు. అలాగే ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు వ్య‌త్యాసం కూడా భారీగా ఉంది. స‌ల్మాన్ ఖాన్ కి 58 ఏళ్లు. ర‌ష్మిక‌కి ఆయ‌న‌లో సంగం కూడా లేవు. ప్ర‌స్తుతం ఆమె వ‌య‌సు 28. అంటే స‌ల్మాన్ కి కుమార్తె వ‌య‌సు.

ఈ రోజే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. పాన్ ఇండియాలో ఈచిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. హిందీ హీరోలంతా సౌత్ మార్కెట్ పై దృష్టి పెట్టిన నేప‌థ్యంలో ముర‌గ‌దాస్ చిత్రంతో స‌ల్మాన్ కూడా ఇక్క‌డకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. వ‌చ్చే ఏడాది ఈద్ సంద‌ర్భంగా చిత్రం విడుద‌ల కానుంది.