Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : నేషనల్‌ క్రష్ మదర్ అంటే ఆమాత్రం ఉండదా?

మీ అందం రష్మికకి వచ్చినట్లు ఉంది మేడం అంటూ రష్మిక మందన్నా తల్లి గురించి తెగ పొగడ్తలు కురిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   5 Oct 2023 5:30 PM GMT
పిక్ టాక్‌ : నేషనల్‌ క్రష్ మదర్ అంటే ఆమాత్రం ఉండదా?
X

నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఎప్పుడూ కూడా తన హాట్ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వైరల్‌ అయ్యే రష్మిక ఈ సారి మాత్రం తన తల్లి తో ఉన్న పోటోను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. రష్మిక తల్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి.


రష్మిక వంటి అందాల రాశిని కన్నది మీరేనా అంటూ కొందరు ఈ ఫోటోలకు తెగ కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం రష్మిక కి తల్లిలా కాకుండా అక్కలా మీరు ఉన్నారు. మీ అందం రష్మికకి వచ్చినట్లు ఉంది మేడం అంటూ రష్మిక మందన్నా తల్లి గురించి తెగ పొగడ్తలు కురిపిస్తున్నారు.

కన్నడ బ్యూటీ అయిన రష్మిక మందన్నా చాలా కాలంగా ఇండస్ట్రీలో హాట్‌ అందాలతో అలరిస్తూ ఉంది. అంతటి అందాల తార అయిన రష్మిక మందన్న కి తల్లి అంటే ఈ మాత్రం ఉంటుందిలే అన్నట్లుగా నెటిజన్స్ రష్మిక తల్లి అందం గురించి తెగ మాట్లాడుకుంటున్నారు.

ఇక రష్మిక హీరోయిన్‌ గా వరుస సినిమాల్లో నటిస్తోంది. పుష్ప 2 తో పాటు నితిన్‌ తో కలిసి నటిస్తున్న సినిమాలతో వచ్చే ఏడాది సందడి చేయబోతుంది. ఇక బాలీవుడ్ లో రష్మిక నటించిన యానిమల్‌ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇటీవలే ఆ సినిమా లోని రష్మిక పాత్రకు సంబంధించిన లుక్ ని రివీల్‌ చేయడం జరిగింది. రష్మిక అందానికి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ముందు ముందు బాలీవుడ్ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్‌ గా రష్మిక మారే అవకాశాలు ఉన్నాయి అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.