Begin typing your search above and press return to search.

నాకంటే అంద‌మైన‌..తెలివైన వారు ఎంతోమంది!

పాన్ ఇండియా అవ‌కాశాలు అందుకుంటూ అంత‌కంత‌కు త‌న రేంజ్ ని రెట్టింపు చేసుకుంటుంది.

By:  Tupaki Desk   |   13 April 2024 4:30 AM GMT
నాకంటే అంద‌మైన‌..తెలివైన వారు ఎంతోమంది!
X

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్..బాలీవుడ్ లో అమ్మ‌డు ఎవ‌రూ లేనంత బిజీగా ఉంది. పాన్ ఇండియా అవ‌కాశాలు అందుకుంటూ అంత‌కంత‌కు త‌న రేంజ్ ని రెట్టింపు చేసుకుంటుంది. ఓచిన్న సినిమాతో ప‌రిచ‌య‌మైన ర‌ష్మిక ఈ స్థాయికి చేరుతుంద‌ని తాను కూడా ఊహించి ఉండ‌దు. ఆ విష‌యంలో నేష‌న‌ల్ క్ర‌ష్ ఎంతో ల‌క్కీ గాళ్ అని చెప్పాలి. అవును ఈ మాట ఇండ‌స్ట్రీ చెప్ప‌డం కాదు ర‌ష్మిక కూడా అంగీక‌రించింది.


'త‌న‌క‌న్నా తెలివైన వారు..అంద‌మైన వారు చాలా మంది ఉన్నారంది. కానీ త‌మ‌ని తాము నిరూపించుకునే అవ‌కాశం కొద్ది మందికే వ‌స్తుంది. అలాంటి అవకాశం నాకు వ‌చ్చింది కాబ‌ట్టే ఇక్క‌డ ఉండ‌గ‌లిగాను. లేదంటే అంద‌రి అమ్మాయిల్లానే ఉండేదాన్ని. సినిమా అనే మాద్య‌మం ఎంత‌గా మార్చేస్తుంద‌న్న‌ది కాల‌క్ర‌మంలో అర్ద‌మైంది. అందుకు నాకు అవ‌కాశాలిచ్చిన ద‌ర్శ‌క‌-నిర్మాత‌ల‌కు ఎప్ప‌టికీ రుణ ప‌డి ఉంటాను. ఇక కెరీర్ లో జ‌యాప‌జ‌యాలు అనేవి అస్స‌లు ప‌ట్టించుకోను. ఎందుకంటే ఇక్క‌డ ప్రశంస‌ల‌తో పాటు..విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కోవాలి.

వాటిని కూడా బ్యాలెన్స్ చేయ‌గ‌ల‌గాలి. అవి మాన‌స‌క కృంగుబాటుకు గురి చేస్తాయి. జీవితంలో ముందుకు సాగ‌లేం. అందుకే వాటి గురించి ఆలోచించ‌ను` అని తెలిపింది. ర‌ష్మిక తొలుతు క‌న్న‌డ ప‌రిశ్ర‌మ నుంచి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. `ఛ‌లో` అనే తొలి సినిమాతోనే మంచి విజ‌యం అందుకుంది. అమ్మ‌డి న‌ట‌న స‌హా వాక్చుత‌ర్యం... యువ‌త‌ని ఆక‌ర్షించే ప‌నులతో మ‌రింత ద‌గ్గ‌రైంది. మ‌రోవైపు సినిమా స‌క్సెస్ లు ఎదుగుద‌ల‌లో కీల‌క పాత్ర పోషించాయి.

`పుష్ప` విజ‌యంతో పాన్ ఇండియాలో ప‌రిచ‌య‌మైంది. అటుపై `యానిమ‌ల్` తో మ‌రోసారి ఇండియాని షేక్ చేసింది. ప్ర‌స్తుతం న‌టిగా తెలుగు...హిందీ సినిమాల‌తో బిజీగా ఉంది. బాలీవుడ్ కి వెళ్లిన త‌ర్వ‌త అక్క‌డ క‌ల్చ‌ర్ కు త‌గ్గ‌ట్టు మౌల్డ్ అయి ముంద‌కు వెళ్తుంది. చిట్టిపొట్టి దుస్తుల్లో అమ్మ‌డి మీడియాలో ఎంత‌టి హంగామా చేస్తుందో? సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంది. టాలీవుడ్ లో ఉన్నంత కాలం అలాంటి స‌న్నివేశాలు ఎక్కడా క‌నిపించ‌ని సంగ‌తి తెలిసిందే.