Begin typing your search above and press return to search.

రష్మిక ఆశలన్నీ దాని మీదే..!

ఒకవేళ యానిమల్ కూడా అటు ఇటైతే మాత్రం రష్మిక బాలీవుడ్ నుంచి పెట్టా బేడా సర్ధేయాల్సి వస్తుంది.

By:  Tupaki Desk   |   22 Sep 2023 8:13 AM GMT
రష్మిక ఆశలన్నీ దాని మీదే..!
X

కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో స్టార్ ఇమేజ్ తెచ్చుకోగా ఆ క్రేజ్ తో వరుస బాలీవుడ్ ఆఫర్లు అందుకుంది. అయితే బీ టౌన్ ఆఫర్ రాగానే సూపర్ ఎగ్జైట్ అయిన రష్మిక అక్కడ సినిమాలు అందుకుంటున్న ఫలితాలు చూసి నిరుత్సాహపడింది. బాలీవుడ్ లో చేసిన సినిమాలేవి రష్మికకు ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ క్రమంలో తనకు ఈ రేంజ్ పాపులారిటీ ఇచ్చిన తెలుగు సినిమాలే చేయాలని అనుకుంటుందట. బాలీవుడ్ లో అమ్మడు ప్రస్తుతం యానిమల్ సినిమాలో నటిస్తుంది.

రణ్ బీర్ కపూర్ హీరోగా వస్తున్న ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవల వచ్చిన టీజర్ తోనే యానిమల్ సినిమా రేంజ్ ఏంటన్నది చూపించాడు సందీప్ వంగ. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక యానిమల్ మీద భారీ అంచనాలు పెట్టుకుంది. తన బాలీవుడ్ కెరీర్ సాఫీగా సాగాలంటే యానిమల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిందే. ఒకవేళ యానిమల్ కూడా అటు ఇటైతే మాత్రం రష్మిక బాలీవుడ్ నుంచి పెట్టా బేడా సర్ధేయాల్సి వస్తుంది.

అందుకే ఇన్నాళ్లు బాలీవుడ్ మాయలో తెలుగులో వచ్చిన అవకాశాలను కాదన్న రష్మిక ఇప్పుడు మళ్లీ తెలుగులో వస్తున్న ఆఫర్లను ఓకే అనేస్తుందట. నితిన్ వెంకీ కుడుముల సినిమా లో రష్మిక నటించాల్సి ఉన్నా డేట్స్ అడ్జెస్ట్ చేయలేకనే రష్మిక సినిమా కాదనుకుంది. నితిన్ సినిమా చేజార్చుకున్నా మాస్ మహరాజ్ రవితేజ తో జత కట్టేందుకు రష్మిక రెడీ అయ్యిందని తెలుస్తుంది.

గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రవితేజ హీరోగా చేసే నెక్స్ట్ సినిమాలో ఫిమేల్ లీడ్ గా రష్మికని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. మాస్ రాజాతో ఛాన్స్ అంటే హీరోయిన్ పాత్ర క్రేజీగా ఉండబోతుందని చెప్పొచ్చు. డాన్ శీను నుంచి క్రాక్ వరకు గోపీచంద్ రవితేజ తీసిన ప్రతి సినిమాతో హిట్ అందుకున్నారు.

సో ఈ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఈ సినిమాలో రష్మిక నటించడం కూడా సినిమాకు ప్లస్ అయ్యే అంశమే అని చెప్పొచ్చు. రెండేళ్లుగా బాలీవుడ్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన రష్మిక యానిమల్ రిజల్ట్ పాజిటివ్ గా ఉంటే అక్కడ ఒకవేళ ఆ సినిమా తేడా కొడితే మన దగ్గర సినిమాలు చేయాలని అనుకుంటుంది.