Begin typing your search above and press return to search.

ఆ యువ హీరోతో రష్మిక.. క్రేజీ ప్రాజెక్ట్!

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన

By:  Tupaki Desk   |   3 Aug 2023 5:31 AM GMT
ఆ యువ హీరోతో రష్మిక.. క్రేజీ ప్రాజెక్ట్!
X

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఏకంగా నాలుగు సినిమాలు వరకు ఉన్నాయి. అందులో అల్లు అర్జున్ తో చేస్తున్న పుష్ప ది రూల్ మూవీ ఒకటి. అలాగే హిందీలో రణబీర్ కపూర్ కి జోడిగా యానిమల్ సినిమా చేస్తుంది. ఈ మూవీ షూటింగ్ రష్మిక పోర్షన్ ఇప్పటికే కంప్లీట్ చేసుకుంది.

మరోవైపు ఫిమేల్ ఓరియెంటెడ్ కథతో జరిగేకుతున్న రెయిన్బో సినిమాలో రష్మిక నటిస్తోంది. ఇది కాకుండా హిందీలో ఓ యంగ్ హీరో కి జోడిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బి టౌన్ లో వినిపిస్తుంది. డేట్స్ అడ్జస్ట్ చేయలేక నితిన్ కి జోడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో చేయాల్సిన సినిమాని రష్మిక వదులుకుంది. ఆస్థానంలోకి ఇప్పుడు శ్రీలీల వచ్చింది. ఇదిలా ఉంటే రష్మిక మందన ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట.

టాలీవుడ్ లో రౌడీ బాయ్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సిద్దు జొన్నలగడ్డ నెక్స్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకత్వంలో మూవీ చేయబోతున్నారు. ఈ సినిమా గ్రాండ్ స్కేల్ పై తెరకెక్కుతోంది. తమన్ సంగీతం అందిస్తుండగా పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయబోతున్నారు. శ్రీకర ప్రసాద్ ఈ సినిమాకి ఎడిటింగ్ చేయనున్నారు.

రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కబోయే ఈ సినిమాలో సిద్దుకి జోడీగా రష్మిక మందనాని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నీరజ కోన ఆమెని కలిసి స్టోరీ కూడా నేరేట్ చేయడం జరిగిందని టాక్. కథ నచ్చడంతో రష్మిక మందన కూడా ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.

పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్న రష్మిక మందన సిద్దు జొన్నలగడ్డ లాంటి యంగ్ హీరోతో జతకట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే కచ్చితంగా ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండే అవకాశం ఉంటుందని గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ డిజె టిల్లుకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ సిద్దుకు జోడిగా నటిస్తోంది. దీని తర్వాత నీరజ కోన దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది