Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : గోల్డెన్‌ గర్ల్‌ రష్మిక చూపు తిప్పుకోనివ్వదే

ఓ రేంజ్ లో ఈ అమ్మడి అందాల ఆరబోత ను చూసిన జనాలు ఇలా చూపించి చూపించకుండా చూపించిన నడుము అందాన్ని చూసి వావ్ అంటున్నారు.

By:  Tupaki Desk   |   30 Oct 2023 4:20 AM GMT
పిక్ టాక్ : గోల్డెన్‌ గర్ల్‌ రష్మిక చూపు తిప్పుకోనివ్వదే
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా బిజీగా ఉంది. రణబీర్ కపూర్ తో కలిసి నటించిన యానిమల్ సినిమా తో రష్మిక హిందీ తో పాటు పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పుష్ప తో పాన్‌ ఇండియా బ్లాక్ బస్టర్ ను దక్కించుకున్న రష్మిక మరోసారి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోబోతుంది అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.


హీరోయిన్ గా రష్మిక ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్‌ మీడియా పై కూడా ఫోకస్ పెడుతూ ఉంటుంది. ఆమె అకౌంట్ ద్వారా షేర్‌ అయ్యే ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉంటాయి. అలాగే ఆమె హాట్ ఫోటోలు ఎవరు షేర్‌ చేసినా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తాయి అనడంలో సందేహం లేదు. అలాంటి రష్మిక తాజాగా గోల్డెన్‌ గర్ల్‌ అవతారంలో కనిపించింది.

రష్మిక మందన్నా గోల్డెన్ కలర్‌ ఔట్‌ ఫిట్ లో గోల్డెన్‌ స్కిన్‌ టోన్ తో అలరించింది. ఓ రేంజ్ లో ఈ అమ్మడి అందాల ఆరబోత ను చూసిన జనాలు ఇలా చూపించి చూపించకుండా చూపించిన నడుము అందాన్ని చూసి వావ్ అంటున్నారు. రష్మిక ను ఎలా చూసినా కూడా చాలా అందంగా ఉంటుందని ఆమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

హీరోయిన్ గా రష్మిక మందన్నా ప్రస్తుతం అల్లు అర్జున్ కు జోడీగా పుష్ప 2 లో నటిస్తోంది. అంతే కాకుండా నితిన్‌ సినిమాలో కూడా ఈ అమ్మడు నటిస్తోంది. ఇంకా రెండు మూడు సినిమాలు షూటింగ్‌ ప్రారంభంకు సిద్ధంగా ఉండగా... కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. బాలీవుడ్ యానిమల్‌ సినిమా హిట్ అయితే అక్కడ స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ గా మారే అవకాశాలు ఉన్నాయి.