Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : చీర కట్టు, పులి గోరు... రష్మిక అదుర్స్‌

ఒక బిస్కట్ కమర్షియల్‌ యాడ్‌ లో నటిస్తున్న సందర్భంగా రష్మిక మందన్న ఇలా చీర కట్టి అందరి దృష్టిని ఆకర్షించింది.

By:  Tupaki Desk   |   25 Jan 2024 8:32 AM GMT
పిక్ టాక్‌ : చీర కట్టు, పులి గోరు... రష్మిక అదుర్స్‌
X

నేషనల్‌ క్రష్ శ్రీవల్లి వరుసగా సినిమాలు చేస్తూ మరో వైపు కమర్షియల్‌ యాడ్స్ లో కూడా నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా లో చీర కట్టి పులిగోరు మెడలో ధరించిన ఫోటోలతో వైరల్ అవుతోంది. వరుసగా బ్లాక్‌ బస్టర్ విజయాలను దక్కించుకున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తూనే ఉంది.


ఒక బిస్కట్ కమర్షియల్‌ యాడ్‌ లో నటిస్తున్న సందర్భంగా రష్మిక మందన్న ఇలా చీర కట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. అందమైన రష్మిక మందన్న ఎర్రటి పట్టు చీర ధరించి పులి గోరు మెడలో వేసుకుని చిన్న కళ్లద్దాలు పెట్టి సింపుల్ అండ్ స్వీట్ గా ఉన్న రష్మిక మందన్న చూపు తిప్పుకోనివ్వడం లేదని కామెంట్స్ చేస్తున్నారు.


నెట్టింట రష్మిక స్కిన్‌ షో ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈసారి ఇలా చీర కట్టిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. రష్మిక ఎలాంటి ఫోటోలతో అయినా నెట్టింట సందడి చేస్తుందని దీంతో మళ్లీ నిరూపితం అయ్యిందని అభిమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు.

యానిమల్‌ సినిమా హిట్ అవ్వడంతో బాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు పుష్ప 2 సినిమా లో ఈ అమ్మడు నటిస్తోంది. ఇదే సమయంలో రెండు లేడీ ఓరియంటెడ్‌ పాన్ ఇండియా సినిమాలను ఈ అమ్మడు చేస్తున్న విషయం తెల్సిందే.

పుష్ప 2 సినిమా తర్వాత ఈ అమ్మడు మరోసారి పాన్ ఇండియా విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ అమ్మడు మరిన్ని పెద్ద సినిమాలకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.