Begin typing your search above and press return to search.

ఆయ‌న ర‌ష్మిక‌ని బ్ర‌హ్మ‌స్త్రంలా వ‌ద‌ల‌బోతున్నాడా?

పైగా చ‌లాకీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న వేదిక‌పై మెరిసిందంటే? కోట్ల రూపాయ‌ల ప‌బ్లిసిటీ వ‌చ్చేసిన‌ట్లే. మాట‌కారి త‌నంతో ఇట్టే ఆక‌ర్షించుకుంటుంది.

By:  Tupaki Desk   |   25 Oct 2023 11:30 PM GMT
ఆయ‌న ర‌ష్మిక‌ని బ్ర‌హ్మ‌స్త్రంలా వ‌ద‌ల‌బోతున్నాడా?
X

రాక్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్-ర‌ష్మిక మంద‌న్న జంట‌గా సందీప్ రెడ్డి వంగ తెర‌కెక్కిస్తోన్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `యానిమ‌ల్` పై భారీ అంచ‌నాలున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు అంచ‌నాలు ఆకాశాన్నంటేలా చేసాయి. పాన్ ఇండియా లో చిత్రాన్ని పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని డిసెంబ‌ర్ 1న రిలీజ్ చేస్తుండ‌టంతో ర‌ణ‌బీర్ క‌పూర్ చిత్రం ప్ర‌మోష‌న్ పై దృష్టి పెట్టి న‌ట్లు తెలుస్తోంది.

ద‌క్షిణాది రాష్ట్రాల్లో ప్ర‌త్యేక ఈవెంట్లు సైతం నిర్వ‌హించ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు వినిపిస్తుంది. దీనిలో భాగంగా హైదరాబాద్ తో పాటు ఈసారి వైజాగ్ లోనూ భారీ ఈవెంట్ కి ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. త‌మిళ‌..తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్ర‌చారం ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ల‌తో నే సినిమాని ఓ రేంజ్ లో ప్ర‌మోట్ చేస్తారు. జ‌నాల్లోకి తీసుకెళ్లేందుకు ర‌క‌ర‌కాల స్ట్రాట‌జీలు అనుస‌రి స్తుంటారు.

పైగా ఈ సినిమా సందీప్ రెడ్డి సినిమా కాబ‌ట్టి తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌త్యేక‌మైన క్రేజ్ క‌నిపిస్తుంది. అర్జున్ రెడ్డి త‌ర్వాత తెర‌కెక్కిస్తోన్న స్ట్రెయిట్ చిత్రం. కాబ‌ట్టి ఇక్క‌డి ఆడియ‌న్స్ కి ఇది స్పెష‌ల్ మూవీగా నిలుస్తుంది. ఈ నేప‌థ్యంలో కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో భారీ ఎత్తున ఈవెంట్ల‌కు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. హైద‌రాబాద్ లో ర‌ణ‌బీర్ క‌పూర్ కి ప్ర‌చారం కొత్తేం కాదు. గ‌త సినిమా బ్ర‌హ్మ‌స్త్ర మొద‌టి భాగాన్ని భారీగానే ప్ర‌మోట్ చేసారు.

దీనిలో భాగంగా తెలుగు ఛానెల్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప్రోగ్రామ్ లో ర‌ణ‌బీర్ క‌పూర్- అలియా భ‌ట్ జంట‌గా పాల్గొన్నారు. ఇలా తెలుగు ఛానెల్ తో ఇంట‌రాక్ష‌న్ అదే తొలిసారి. ఈ నేప‌థ్యంలో యానిమ‌ల్ కోసం ఇంకా స్పెష‌ల్ గా ప్లాన్ చేస్తారు.

పైగా చ‌లాకీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న వేదిక‌పై మెరిసిందంటే? కోట్ల రూపాయ‌ల ప‌బ్లిసిటీ వ‌చ్చేసిన‌ట్లే. మాట‌కారి త‌నంతో ఇట్టే ఆక‌ర్షించుకుంటుంది. యానిమ‌ల్ టీం ర‌ష్మ‌క‌ని ప‌ర్పెక్ట్ గా వినియోగించుకోల్గితే సినిమాకి మంచి ప్ల‌స్ అవుతుంది. ర‌ష్మిక ని తెలుగు ప్ర‌చారం కోసం బ్ర‌హ్మ‌స్త్రంలా దించితే స‌రి.