Begin typing your search above and press return to search.

ఆ నెటి జ‌నుడుకి ర‌ష్మిక ధీటైన రిప్లై!

ఎలాంటి అంశంపైనైనా ఆల‌స్య‌మైనా రిప్లై ఇవ్వ‌డం వ్వాటే బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న త‌త్వం. వివాదం ఎలాంటిదైనా తెలివిగా డీల్ చేయ‌గ‌ల నేర్ప‌రి

By:  Tupaki Desk   |   14 Feb 2024 6:50 AM GMT
ఆ నెటి జ‌నుడుకి ర‌ష్మిక ధీటైన రిప్లై!
X

ఎలాంటి అంశంపైనైనా ఆల‌స్య‌మైనా రిప్లై ఇవ్వ‌డం వ్వాటే బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న త‌త్వం. వివాదం ఎలాంటిదైనా తెలివిగా డీల్ చేయ‌గ‌ల నేర్ప‌రి. త‌న‌పై డీప్ ఫేక్ తెర‌పైకి వ‌చ్చిన స‌మ‌యంలో స‌మ‌య స్పూర్తితో స్పందించింది అంద‌రి నుంచి ఎలాంటి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకుందో తెలిసిందే. ఆ వీడియోపై పెద్ద పెద్ద లెజెండ‌రీలే ర‌ష్మిక‌కి మ‌ద్ద‌తుగా నిలిచారు. ఇటీవ‌లే 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' చిత్రంలో ర‌ష్మిక కేవలం డైరెక్టర్.. హీరో కోసమే న‌టించింద‌ని నెట్టింట ప్ర‌చారం సాగిన సంగ‌తి తెలిసిందే.

ఓ నెటిజ‌నుడు ఆసినిమాలో ర‌ష్మిక న‌టించ‌డం వెనుక అస‌లు కార‌ణం వాళ్లిద్ద‌రే అంటూ రాసుకొచ్చాడు. అది నెట్టింట వైర‌ల్ అవ్వ‌డం తో ర‌క‌ర‌కాల క‌థ‌నాలు తెర‌పైకి వ‌చ్చాయి. తాజాగా ఆ రూమ‌ర్లు అన్నింటిని ర‌ష్మిక కొట్టిపారేసింది. 'అలా అని ఎవరు చెప్పారు? నేను కథను నమ్మి మాత్రమే సినిమాలు చేస్తాను. అలాంటి యాక్టర్లతో సినిమా చేయడం ఒక గౌరవం. అసలు ఇలాంటి వార్తలు ఎక్కడ మొదలవుతాయో' అంటూ రష్మిక ఆశ్చర్యం..అస‌హనాన్ని వ్య‌క్తం చేసింది.

అలాగే గ‌తంలో ర‌ష్మిక పారితోషికం పెంచిన‌ట్లు కూడా క‌థ‌నాలు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. అవ‌న్నీ క‌ట్టు క‌థ‌నాల‌న్ని వివ‌ర‌ణ ఇచ్చింది. ప్ర‌స్తుతం ర‌ష్మిక న‌టిగా ఎంత బిజీగా ఉందో చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్..టాలీవుడ్ సినిమాలతో క్ష‌ణం తీరిక లేకుండా క‌నిపిస్తుంది. కొన్ని నెల‌లుగా ముంబై టూ హైద‌రాబాద్ చ‌క్క‌ర్లు కొడుతుంది. యానిమ‌ల్ విజ‌యంతో హిందీలో కొత్త అవ‌కాశాలు జోరుగా వ‌స్తున్నాయి.

తెలుగు నుంచి లేడీ ఓరియేంటెడ్ ఆఫ‌ర్లు వెంట ప‌డుతున్నాయి. వేటిని కాద‌న‌కుండా తెలివిగా లాక్ చేస్తుంది. ఇటీవ‌లే ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్క‌నున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి ర‌ష్మిక సైన్ చేసిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. 'పుష్ప‌-2' చిత్రీక‌ర‌ణ ముగింపు చేరుకున్న నేప‌థ్యంలో ర‌ష్మిక కొత్త అప్ డేట్లు అన్ని వెలుగులోకి వ‌స్తున్నాయి.