Begin typing your search above and press return to search.

సంచ‌ల‌న పాత్ర‌లో ర‌ష్మిక‌...భ‌లే స‌ర్ ప్రైజ్!

నేష‌న‌ల్ క్ర‌ష్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు టాలీవుడ్ ..బాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది

By:  Tupaki Desk   |   29 Jan 2024 9:39 AM GMT
సంచ‌ల‌న పాత్ర‌లో ర‌ష్మిక‌...భ‌లే స‌ర్ ప్రైజ్!
X

నేష‌న‌ల్ క్ర‌ష్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు టాలీవుడ్ ..బాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ ని మించి బాలీవుడ్ లో ఫైమ‌స్ అయిపో తుంద‌నొచ్చు. ఇటీవ‌ల రిలీజ్ అయిన 'యానిమ‌ల్' విజయంతో ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. అక్క‌డ ఒక్క హిట్ ర‌ష్మిక రేంజ్ ని మార్చేసింది. తాజాగా అమ్మ‌డి స్పీడ్ చూస్తుంటే స్టార్ లీగ్ లో చేర‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌నిపిస్తుంది.

ర‌ష్మిక అలాంటి పాత్ర‌ల ఎంపిక‌తో అతి చేరువ‌లోనే ఉంద‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ర‌ష్మిక విక్కీ కౌశ‌ల్ తో 'ఛావా' అనే సినిమాలో న‌టిస్తోంది. ల‌క్ష్మ‌ణ్ ఉట్టేక‌ర్ తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది. ఇందులో అమ్మ‌డు సినీ చ‌రిత్ర‌లో గుర్తిండిపోయే పాత్ర పోషిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హ‌రాజ్ కుమారుడు శంభాజీ మ‌హ‌రాజ్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ర‌ష్మిక శంభాజీ భార్య ఏసుబాయి పాత్ర‌లో న‌టిస్తోంది.

ఇంత‌వ‌ర‌కూ ఈ విష‌యం పెద్ద‌గా ఎక్క‌డా హైలైట్ కాలేదు. తాజాగా ఈ సినిమా షూట్ పూర్త‌యిన సంద‌ర్భం గా ర‌ష్మిక ఆస‌క్తిక‌ర పోస్ట్ చేయ‌డంతో ఈ విష‌యం సంచ‌ల‌నంగా మారింది. చ‌రిత్ర‌ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిస్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాలో పాత్ర‌లు ఎంత బ‌లంగా ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. అలాం టి రోల్స్ న‌టీన‌టులంద‌రికీ ఎంతో ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకొస్తాయి. హిట్ అయితే న‌టీన టుల రేంజ్ ని సైతం మార్చేసే చిత్రాల‌వి.

'ఛావా'లో ర‌ష్మిక పాత్ర ఎంత బ‌ల‌మైన‌ద‌న్న‌ది అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. హీరోకి ధీటుగా ఆ రోల్ ఉంటుంద‌ని యూనిట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ర‌ష్మిక స్పీడ్ కి ఇలాంటి స‌క్సెస్ ఒక‌టి ప‌డితే ఆమె వేగాన్ని ఆప‌డం ఎవ‌రి త‌రం. ఇప్ప‌టికే క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల్లో త‌న‌దైన బ్రాండ్ తో దూసుకుపోతుంది. చారిత్రాత్మ‌క పాత్ర‌ల్లోనూ ర‌ష్మిక ఒదిగిపోయిందంటే? బాలీవుడ్ లో చ‌క్రం తిప్ప‌డం ఖాయ‌మే.