Begin typing your search above and press return to search.

సౌంద‌ర్య బ‌యోపిక్‌లో ర‌ష్మిక‌?

బయోపిక్‌లలో నటించే అవ‌కాశం వ‌స్తే కాద‌ని అంటారా? ర‌ష్మిక మంద‌న్న కూడా త‌న‌ ఆసక్తిని వ్యక్తం చేసింది

By:  Tupaki Desk   |   28 Jan 2024 12:30 PM GMT
సౌంద‌ర్య బ‌యోపిక్‌లో ర‌ష్మిక‌?
X

బయోపిక్‌లలో నటించే అవ‌కాశం వ‌స్తే కాద‌ని అంటారా? ర‌ష్మిక మంద‌న్న కూడా త‌న‌ ఆసక్తిని వ్యక్తం చేసింది. బయోపిక్‌లలో నటించడానికి మీకు ఆసక్తి ఉందా? అని రష్మికను గ‌తంలో ఒక ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా నేను శ్రీదేవి లేదా సౌందర్య బయోపిక్‌లలో నటించాలనుకుంటున్నాను అని అంది. దాదాపు మూడేళ్ల క్రితం ఇంట‌ర్వ్యూలో ర‌ష్మిక ఇలాంటి ఆస‌క్తిని క‌న‌బ‌రిచింది.

దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమల్లో బయోపిక్‌ల హవా నడుస్తున్న వేళ ఈ మాట అంది. క్రికెటర్ ఎంఎస్ ధోని, మేరికోమ్ నుంచి అలనాటి నటి గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి వరకు ఎందరో గొప్ప వ్య‌క్తుల‌ జీవిత కథలు తెరపైకి వచ్చాయి. ఇటీవ‌ల‌ ఇలాంటి ప్రాజెక్ట్‌లు చాలానే మేకింగ్‌లో ఉన్నాయి. కానీ అప్ప‌ట్లోనే శ్రీ‌దేవి లేదా సౌంద‌ర్య‌గా న‌టిస్తాన‌ని ర‌ష్మిక కోరుకుంది.

అయితే శ్రీదేవి చనిపోయినప్పటి నుంచి చాలా మంది నటీమణులు శ్రీదేవి బయోపిక్ ఎప్పుడయినా తీస్తే అందులో నటించాలని ఆసక్తిని వ్యక్తం చేశారు. కానీ సౌంద‌ర్య బ‌యోపిక్ గురించి అంత‌గా ఎవ‌రూ ప్ర‌స్థావించ‌లేదు. కానీ ర‌ష్మిక ఇప్ప‌టికీ సౌంద‌ర్య బ‌యోపిక్ తెర‌కెక్కిస్తే అందులో న‌టించాల‌నుంద‌ని తెలిపారు. త‌న‌ను చిన్న‌ప్పుడు సౌంద‌ర్య‌లా ఉంటావ‌ని కుటుంబ స‌భ్యులు పొగిడేసేవార‌ని కూడా ర‌ష్మిక తాజా ఇంట‌ర్వ్యూలో మ‌రోసారి గుర్తు చేసుకుంది. దాదాపు మూడేళ్ల త‌ర్వాత కూడా ర‌ష్మిక సౌంద‌ర్య‌ను మ‌ర్చిపోలేదంటే తన జీవిత‌క‌థ‌లో న‌టించాలని ఎంత బ‌లంగా కోరుకుంటుందో అర్థం చేసుకోవాలి.

2018లో 'ఛలో' చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ర‌ష్మిక మంద‌న‌ పెద్ద స్టార్ అవుతుందని నాడు ఎవరూ ఊహించలేదు. అయితే తెలుగులో ప‌లు విజయ‌వంత‌మైన‌ సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్‌కి వెళ్లింది. కానీ అక్క‌డ వ‌రుస ఫ్లాపుల‌తో పెద్ద స్టార్ అయ్యే పెద్ద అవకాశాన్ని కోల్పోయిందని చాలా మంది భావించారు. కానీ యానిమ‌ల్ తో తిరిగి గ్రేట్ కంబ్యాక్ చూపించింది. ఇప్పుడు మళ్లీ అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో అగ్రస్థానానికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. పుష్ప‌- యానిమ‌ల్ చిత్రాల‌తో ర‌ష్మిక‌ నటన గురించి మాట్లాడుకోవడం మ‌రింత ఎక్కువైంది. త‌దుప‌రి పుష్ప 2, ధనుష్‌- శేఖర్ కమ్ముల తదుపరి చిత్రం, బేబీ ప్రొడ్యూసర్ గర్ల్‌ఫ్రెండ్ .. ద్విభాషా చిత్రం రెయిన్‌బో వంటి అనేక భారీ తెలుగు చిత్రాల్లో న‌టిస్తోంది. ఈ లైన‌ప్ చూస్తుంటే ర‌ష్మిక క‌చ్ఛితంగా నంబ‌ర్ వ‌న్ స్టార్ గా త‌న స్థానాన్ని ప‌దిలం చేసుకుంటుంద‌నే అనిపిస్తోంది.