Begin typing your search above and press return to search.

రష్మిక కూడా అదే తప్పు చేస్తుందా..?

తెలుగులో మంచి ఫాం లో ఉన్న టైం లోనే బాలీవుడ్ ఆఫర్లు రావడం వాటికి ఓకే చెప్పడం

By:  Tupaki Desk   |   27 July 2023 1:30 PM GMT
రష్మిక కూడా అదే తప్పు చేస్తుందా..?
X

కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో అనతికాలంలోనే స్టార్ క్రేజ్ దక్కించుకుంది. నాగ శౌర్య, విజయ్ దేవరకొండ, నాని లాంటి హీరోలతో నటిస్తూ ఆ నెక్స్ట్ వరుస స్టార్ అవకాశాలను అందుకుంది. తనకు వచ్చిన పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ వచ్చిన రష్మిక అలా టాప్ 3 హీరోయిన్స్ లిస్ట్ లో చేరింది. లాస్ట్ ఇయర్ ఆడవాళ్లు మీకు జోహార్లు, సీతారామం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక ఆ సినిమాల్లో ఒకటి హిట్ మరోటి ఫెయిల్యూర్ రిజల్ట్ అందుకుంది. సీతారామం లో హీరోయిన్ పాత్ర కాకుండా సపోర్టింగ్ రోల్ చేయడం మంచి విషయం.

తెలుగులో మంచి ఫాం లో ఉన్న టైం లోనే బాలీవుడ్ ఆఫర్లు రావడం వాటికి ఓకే చెప్పడం చేసిన రష్మిక ఏడాదిన్నర అవుతున్నా ఒక్క తెలుగు సినిమా సై చేయలేదు. నితిన్ వెంకీ కుడుముల సినిమా చేస్తుందని అనుకోగా ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా ఆమె ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. తెలుగులో రష్మిక కొనసాగాలని అనుకోవడం లేదా టాలీవుడ్ పై అప్పుడే రష్మిక ప్రేమ తగ్గిపోయిందా అని కామెంట్ చేయడం మొదలు పెట్టారు.

కొద్దిగా స్టార్ క్రేజ్ వచ్చిన తర్వాత వచ్చిన ఆఫర్లను చేయకుండా సినిమాలో అది ఉండాలి ఇది ఉండాలి అని హీరోయిన్స్ సినిమాలను రిజెక్ట్ చేయడం తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ విషయంలో కూడా అది రిపీట్ అవుతూ వస్తుంది. రష్మిక కూడా ఈమధ్య తన దగ్గరకు వచ్చిన రెండు సినిమాలను కాదనేసిందని టాక్. అయితే ఆ సినిమాల కథ నచ్చలేదో లేదా మరో కారణమో తెలియదు కానీ తెలుగులో అసలు సినిమాలు లేని టైం లో వచ్చిన ఆఫర్ ని కాదనడం రష్మిక గురించి అందరు మాట్లాడుకునేలా చేస్తుంది. రష్మిక కూడా ఇంతకుముందు హీరోయిన్స్ చేసిన పొరపాట్లను చేస్తుందని అంటున్నారు.

నేషనల్ క్రష్ రష్మిక నెక్స్ట్ తెలుగు సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. నితిన్ సినిమా నుంచి దాదాపుగా ఆమె తప్పుకున్నట్టే అని తెలుస్తుండగా రష్మిక చేజార్చుకున్న ఈ ఛాన్స్ ని మీనాక్షికి వరించిందని టాక్. ఇలా రష్మిక లైట్ తీసుకుంటే మాత్రం టాలీవుడ్ లో కెరీర్ రిస్క్ లో పడే ఛాన్స్ ఉంది. సో రష్మిక ఇక మీదట జాగ్రత్త పడకపోతే మాత్రం జరగాల్సిన నష్టం జరిగాక ఎంత ప్రయత్నించినా సరే వర్క్ అవుట్ అవ్వదని చెప్పొచ్చు.