Begin typing your search above and press return to search.

దానిపై మరీ అంత ప్రేమ ఏంటి శ్రీవల్లి...!

ఇప్పుడు రష్మిక మందన్న రెండు మూడు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను కూడా చేస్తున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   1 April 2024 10:43 AM GMT
దానిపై మరీ అంత ప్రేమ ఏంటి శ్రీవల్లి...!
X

పుష్ప మరియు యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌ డమ్‌ దక్కించుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. ఇప్పటికే పుష్ప 2 సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు తమిళంలో ధనుష్ కి జోడీగా ఒక సినిమా లో, హిందీలో ఒకటి రెండు సినిమాల్లో నటిస్తోంది.


ఇంత బిజీగా ఉన్న రష్మిక మందన్న కొన్నాళ్లుగా వర్కౌట్స్ మానేశాను... మళ్లీ మొదలు పెట్టాను అంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు రష్మిక మందన్న రెండు మూడు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను కూడా చేస్తున్న విషయం తెల్సిందే. సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా పోస్టులు పెట్టే రష్మిక తాజాగా ఆసక్తికర పోస్ట్‌ షేర్ చేసింది.

తన పెట్‌ డాగ్ ను బెడ్‌ పై పడుకోబెట్టుకుని సోషల్‌ మీడియాలో ఆ ఫోటోను షేర్‌ చేసింది. నా ఉదయం ఈమెతో చాలా బెస్ట్‌ గా మారుతుంది అంటూ ఈ ఫోటోకు రష్మిక మందన్న లవ్‌ ఈమోజీని షేర్‌ చేసి మరీ కామెంట్ చేసింది. అందమైన ఈ ఫోటో కి నెటిజన్స్ క్యూట్‌ గా ఉందంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఒక పెట్‌ డాగ్‌ పై ఇంత అభిమానం, ప్రేమ ఏంటి అమ్మడు అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో ఒక పెట్‌ ను ప్రేమించిన సెలబ్రిటీని మేము చూడలేదు అంటూ కొందరు సోషల్‌ మీడియాలో మాట్లాడుకుంటూ ఉన్నారు. మొత్తానికి రష్మిక తన పెట్‌ లవ్‌ ను ఇలా చూపించి అందరిని ఆశ్చర్య పరిచింది.

రష్మిక మందన్న బాలీవుడ్‌ లో చేసిన గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచినా కూడా యానిమల్‌ సినిమాతో స్టార్‌ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. దాంతో కచ్చితంగా ముందు ముందు హిందీలో మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.