Begin typing your search above and press return to search.

నేష‌న‌ల్ క్ర‌ష్ బ్యూటీకి టాప్ లీగ్ లో కుర్చీ!

ర‌ష్మిక పాత్ర ఇంకా బలంగా ఉంటే బాగుండ‌నిపించింది. ఓవైపు ర‌ణ‌బీర్..మ‌రోవైపు అనీల్ క‌పూర్ పాత్ర‌లు ధీటుగా సాగుతోన్న స‌మ‌యంలో ర‌ష్మిక రోల్ ఆడియ‌న్స్ ని రొమాంటిక్ మోడ్ లోకి తీసుకెళ్లేది.

By:  Tupaki Desk   |   10 Dec 2023 12:38 PM GMT
నేష‌న‌ల్ క్ర‌ష్ బ్యూటీకి టాప్ లీగ్ లో కుర్చీ!
X

ర‌ష్మిక మంద‌న్న అలియాస్ గీతాంజ‌లికి అప్పుడే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేర్చుతున్నారా? ఒక్క బాలీవుడ్ హిట్ అమ్మ‌డి రేంజ్ ని మార్చేసిందా? అంటే అవున‌నే అంటున్నాయి బాలీవుడ్ వ‌ర్గాలు. ఇటీవ‌లే రిలీజ్ అయిన `యానిమ‌ల్` లో ర‌ష్మిక పెర్పార్మెన్స్ ఏ రేంజ్ లోఉందో తెలిసిందే. ర‌ణ‌బీర్ క‌పూర్ భార్య పాత్ర‌లో అమ్మ‌డి అభిన‌యంతో అద‌ర‌గొట్టేసింది. తెర‌పై క‌నిపించినంత‌సేపు త‌ద‌నైన మార్క్ పెర్పార్మె న్స్ తో ఆక‌ట్టుకుంది.

ర‌ష్మిక పాత్ర ఇంకా బలంగా ఉంటే బాగుండ‌నిపించింది. ఓవైపు ర‌ణ‌బీర్..మ‌రోవైపు అనీల్ క‌పూర్ పాత్ర‌లు ధీటుగా సాగుతోన్న స‌మ‌యంలో ర‌ష్మిక రోల్ ఆడియ‌న్స్ ని రొమాంటిక్ మోడ్ లోకి తీసుకెళ్లేది. ర‌ష్మిక పాత్ర స‌క్స‌స్ అవ్వ‌డానికి ఈ లాజిక్ కార‌ణ‌మైంది. కానీ ఇంకా ఇంటెన్స్ తో ఆ రోల్ చూపిస్తే ఉంటే బాగుండు అనిపిం చింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వ‌సూళ్లు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే 500 కోట్ల‌కు పైగా రాబ‌ట్టింది.

1000 కోట్ల దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇక ఈ సినిమాకంటే ముందు ర‌ష్మిక `పుష్ప‌`తో పాన్ ఇండియాలోనే ఫేమ‌స్ అయింది. ఆ సినిమా కూడా నార్త్ బెల్డ్ లో భారీ వ‌సూళ్లు సాధించింది. శ్రీవ‌ల్లి పాత్ర హిందీ ఆడియ‌న్స్ ని ఎంత‌గానో మెప్పించింది. ఓ తెలుగు సినిమా హీరోయిన్ రోల్ ఇంత‌లా క‌నెక్ట్ అవ్వ‌డం అన్న‌ది అదే తొలిసారి. `పుష్ప` త‌ర్వాత `యానిమ‌ల్` కంటే ముందు ర‌ష్మిక కొన్ని హిందీ సినిమాలు చేసింది.

కానీ అవి పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. ఆవేవి ర‌ష్మిక ఇమేజ్ ని దెబ్బ తీయ‌లేదు. తాజాగా `యానిమ‌ల్` స‌క్సెస్ నేప‌థ్యం.. ర‌ష్మిక‌కి కొత్త‌గా వ‌స్తోన్న హిందీ అవ‌కాశాల నేప‌థ్యంలో బాలీవుడ్ స్టార్ లీగ్ కి అన్ని ర‌కాలుగా అర్హురాలే అన్న ప్ర‌చారం సాగుతోంది. ర‌ష్మిక‌కి ..దీపికా ప‌దుకొణే..అలియాభ‌ట్ స‌ర‌స‌న స్థానం ఇవ్వొచ్చు అన్న వార్త‌లు ఒక్క‌సారిగా ఊపందుకుంటున్నాయి. ఇన్ స్టా గ్రామ్ లో అమ్మ‌డి ఫాలోయింగ్...బాలీవుడ్ న‌టీమ‌ణుల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా అమ్మ‌డి ఫిట్ నెస్ ప్రీక్ వీడియోలు ప్ర‌తీదిర‌ష్మిక రేంజ్ ని పెంచుతున్న‌వే.