Begin typing your search above and press return to search.

వైరల్‌ వీడియో : శ్రీవల్లి - 2 ను చూశారా...!

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌ లో వచ్చిన పుష్ప ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By:  Tupaki Desk   |   22 March 2024 7:23 AM GMT
వైరల్‌ వీడియో : శ్రీవల్లి - 2 ను చూశారా...!
X

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌ లో వచ్చిన పుష్ప ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో హీరోయిన్‌ గా రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో నటించి మెప్పించింది. కాస్త డీ గ్లామర్‌ గా కనిపిస్తూనే అందాల ఆరబోత చేసిన రష్మిక వర్షన్‌ 2 కి రెడీ అయ్యింది.

పుష్ప 1 చివర్లో పుష్ప కి శ్రీవల్లి కి పెళ్లి అవ్వడం మనం చూశాం. ఇక పుష్ప 2 లో పుష్ప భార్య గా శ్రీవల్లిని చూడబోతున్నాం. మొదటి పార్ట్‌ తో పోల్చితే రెండో పార్ట్‌ లో అందం కంటే ఎక్కువ నటనకు స్కోప్ ఉంటుందని, రష్మిక మందన్న తన నట విశ్వరూపం చూపించే ఛాన్స్ ను సుకుమార్‌ కలిగించాడు అనే టాక్ వినిపిస్తుంది.

ఆ విషయం పక్కన పెడితే తాజాగా పుష్ప 2 సినిమా షూటింగ్‌ వైజాగ్ చుట్టు పక్కల ప్రాంతాల్లో నిర్వహించారు. ఆ సమయంలో రష్మిక మందన్న ఇలా శ్రీవల్లి లుక్ లో కనిపించడంతో అక్కడున్న ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు కేరింతలు కొడుతూ ఉన్న వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

రెడ్‌ చీరలో చాలా బంగారు నగలు వేసుకుని జెడలో పూలు పెట్టుకుని ఒక పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తూనే పద్దతైన గృహిణి గా కూడా రష్మిక కనిపిస్తుందని వీడియో చూసిన వారు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో శ్రీవల్లి 2 అంటూ వీడియోను ఆమె ఫ్యాన్స్ తెగ షేర్‌ చేస్తున్నారు.

శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న పుష్ప 2 సినిమా ను ఈ ఏడాది ఆగస్టు లో విడుదల చేసే విధంగా దర్శకుడు సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న ఈ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా విదేశీ భాషల్లో కూడా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.