Begin typing your search above and press return to search.

ఖుషి రష్మిక చేసుంటే..?

ఆల్రెడీ విజయ్ రష్మికల మధ్య సీక్రెట్ రిలేషన్ షిప్ నడుస్తుందన్న టాక్ ఉంది. ఈ సినిమా చేసుంటే వారి క్రేజ్ సినిమాకు చాలా ప్లస్ అయ్యేదని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   2 Sep 2023 4:30 PM GMT
ఖుషి రష్మిక చేసుంటే..?
X

విజయ్ దేవరకొండ సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఖుషి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కథలో అంతగా కొత్తదనం లేకపోయినా విజయ్ సమంతల మధ్య లవ్ అండ్ ఎఫక్షన్ ఎమోషనల్ సీన్స్ ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను మెప్పించడంతో సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమాపై ముందు నుంచి అంచనాలు ఉండటం పాజిటివ్ టాక్ కూడా రావడంతో ఖుషి అన్నిచోట్ల మంచి ఆక్యుపెన్సీ సాధించింది. యూఎస్ లో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం విశేషం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా టైటిల్ ఖుషిని వాడుతున్నందుకు పవర్ స్టార్ ఫ్యాన్స్ మొదట్లో కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సూపర్ హిట్ టైటిల్ ని చెడగొడతారని భయపడ్డారు. కానీ ఖుషి టాక్ చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాకు ఈ టైటిల్ పర్ఫెక్ట్ అని చెప్పుకుంటున్నారు. ఇక సినిమాలో లీడ్ పెయిర్ విజయ్ సమంతల మధ్య సీన్స్ అన్నీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతున్నాయి. లవ్ స్టోరీల్లో సమంత తన మార్క్ నటనతో ఆకట్టుకుంటుంది. అయితే ఖుషి సినిమాలో విజయ్ కన్నా సమంత బెటర్ గా నటించలేదని చెప్పొచ్చు.

ఆమెకున్న పర్సనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కావొచ్చు మరోటి కావొచ్చు కానీ ఎప్పుడు స్క్రీన్ మీద నటనలో ది బెస్ట్ అనిపించే సమంత ఎందుకో ఖుషిలో తన పాత్రను ఫుల్ ఫిల్ చేయలేకపోయింది. అయితే ఆ బాధ్యత తన మీద వేసుకుని విజయ్ అదరగొట్టేశాడు. అయితే ఈ సినిమాలో సమంత బదులుగా రష్మికని తీసుకుంటే ఎలా ఉండేదన్న డిస్కషన్ సోషల్ మీడియాలో జరుగుతుంది. విజయ్ రష్మిక ఇద్దరు కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అన్న టాక్ ఉంది.

ఖుషి సినిమాలో డైరెక్టర్ ఆప్షన్ సమంత అయ్యింది కాబట్టే విజయ్ ఏమి మాట్లాడలేదు. ఒకవేళ ఈ సినిమాలో సమంత ప్లేస్ లో రష్మిక చేసి ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని అంటున్నారు. ఆల్రెడీ విజయ్ రష్మికల మధ్య సీక్రెట్ రిలేషన్ షిప్ నడుస్తుందన్న టాక్ ఉంది. ఈ సినిమా చేసుంటే వారి క్రేజ్ సినిమాకు చాలా ప్లస్ అయ్యేదని చెప్పొచ్చు. అయితే సమంతని అంత తక్కువగా తీసి పారేయలేం కానీ ఖుషిలో ఒకవేళ రష్మిక నటిస్తే మాత్రం సినిమాకు ఇంకాస్త బూస్టింగ్ వచ్చేదని చెప్పొచ్చు.