Begin typing your search above and press return to search.

రష్మిక లక్కు మాములుగా లేదు!

ఇక ఇలాంటి ప్రాజెక్టులో ఏ బ్యూటీ అవకాశం దక్కించుకుంటుందో అని అందరు ఎదురుచూస్తున్న సమయంలో రష్మిక ఆ లక్కీ ఛాన్స్ కొట్టేసిందే.

By:  Tupaki Desk   |   14 Aug 2023 7:21 AM GMT
రష్మిక లక్కు మాములుగా లేదు!
X

స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకుంటున్న రష్మిక మందన్న మిగతా హీరోయిన్స్ నుంచి పోటీ ఎంత ఉన్నా కూడా తనదైన శైలిలో అవకాశాలు అయితే అందుకంటోంది. ప్రతి ఏడాది మినిమం సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో బిజీ గా మారుతుంది. ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత ఆమె రేంజ్ చాలా పెరిగిపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది.


కానీ అటువైపు నుంచి ఆమెకు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ లు అయితే రావడం లేదు. అయినప్పటికీ ఈ బ్యూటీ తన ప్రయత్నాలను ఏమాత్రం తగ్గించడం లేదు. ఇక ఈ కన్నడ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్టులపై ఎక్కువగా ఫోకస్ చేసినట్లు అనిపిస్తోంది. కంటెంట్ ఉన్న మంచి కథలను సెలెక్ట్ చేసుకోవడంలో ఆమె ఆలోచన విధానం కూడా హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

ఈ ఏడాది మొదట్లో విజయ్ తో చేసిన వారిసు సినిమా కమర్షియల్ గా బాగానే పేరు తెచ్చి పెట్టింది. ఇక తమిళ్ ఇండస్ట్రీలో కూడా రష్మిక పేరు చాలా బాగా హైలైట్ అయింది. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో యానిమల్, పుష్ప 2.. అనే రెండు క్రేజీ ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. ఇక వీటితోపాటు అమ్మడు మొదటిసారి ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించబోతోంది. రెయిన్ బో అనే టైటిల్ తో తెర పైకి రాబోతున్న ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కుతోంది.

ఇక ఇప్పుడు రష్మిక మరొక ఆసక్తికరమైన ప్రాజెక్టును చేజిక్కించుకుంది. డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న శేఖర్ కమ్ముల మొదటిసారి ధనుష్ తో ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కరప్షన్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రాబోతున్నట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇటీవల అధికారికంగా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు.

ఇక ఇలాంటి ప్రాజెక్టులో ఏ బ్యూటీ అవకాశం దక్కించుకుంటుందో అని అందరు ఎదురుచూస్తున్న సమయంలో రష్మిక ఆ లక్కీ ఛాన్స్ కొట్టేసిందే. అఫీషియల్ గా ఈ రోజు ఎనౌన్స్ చేశారు. ఒకవైపు శేఖర్ కమ్ముల - మరొకవైపు టాలెంటెడ్ హీరో ధనుష్. కేవలం ఈ పేర్లతోనే ప్రాజెక్టుపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. తప్పకుండా కంటెంట్ మాత్రం చాలా బలంగా ఉండబోతున్నట్లు అనిపిస్తోంది. ఇక ఇలాంటి సినిమాలో రష్మిక ఛాన్స్ కొట్టేసింది అంటే తప్పకుండా ఆమె పాత్ర కూడా హైలైట్ అవుతుంది అని చెప్పవచ్చు. ఇక ఆ సినిమాతో సక్సెస్ అందుకుంటే మాత్రం మరో నాలుగేళ్లపాటు అమ్మడికి డోకా ఉండదు.