Begin typing your search above and press return to search.

రష్మిక.. మూడు పెద్దవి.. మరో మూడు చిన్నవి..

నేటిత‌రం క‌థానాయిక‌ల్లో స్పీడున్న భామ‌గా ర‌ష్మిక మంద‌న్న‌కు గుర్తింపు ఉంది.

By:  Tupaki Desk   |   10 May 2024 5:17 AM GMT
రష్మిక.. మూడు పెద్దవి.. మరో మూడు చిన్నవి..
X

నేటిత‌రం క‌థానాయిక‌ల్లో స్పీడున్న భామ‌గా ర‌ష్మిక మంద‌న్న‌కు గుర్తింపు ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఆఫ‌ర్లతో ప్రస్తుతం దేశంలోని టాప్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు అనే విషయాన్ని కాదనలేం. అలియా భట్ తర్వాత పలు భాషల్లో వ‌రుస‌ సినిమాలు చేస్తున్న ఏకైక నటి ర‌ష్మిక మంద‌న‌. పుష్ప ఫ్రాంఛైజీలో శ్రీ‌వ‌ల్లి పాత్ర‌తో ర‌ష్మిక క్రేజ్ అమాంతం పెరిగింది. నేష‌న‌ల్ క్ర‌ష్ గా వెలిగిపోతున్న ర‌ష్మిక కెరీర్ కి ఇది బిగ్ బూస్ట్ నిచ్చింద‌ని చెప్పాలి. ఇటీవ‌లే `యానిమ‌ల్` చిత్రంలోను అద్భుత న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేసింది రష్మిక‌. ర‌ష్మిక ఈ ఏడాది కొన్ని అతిపెద్ద విడుద‌ల‌ల‌తో వేవ్స్ క్రియేట్ చేయ‌బోతోంది. వీటిలో మూడు భారీ చిత్రాలు, మ‌రో మూడు చిన్న చిత్రాలు ఉన్న‌యి.


స‌ల్మాన్‌తో సికింద‌ర్:

తాజా స‌మాచారం మేర‌కు ర‌ష్మిక‌ మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ని ఛేజిక్కించుకుంది. బాలీవుడ్ కండ‌ల హీరో సల్మాన్ ఖాన్ స‌ర‌స‌న `సికిందర్‌`కి సంతకం చేసిందని స‌మాచారం. ఇది త‌న కెరీర్ లో మ‌రో గేమ్ ఛేంజ‌ర్ గా మారుతుంద‌ని అంచ‌నా. సికింద‌ర్ చిత్రానికి ఏ.ఆర్.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. సాజిద్ న‌డియాద్ వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈద్ కానుక‌గా విడుద‌ల కానుంది.

పుష్ప 2లో క్రేజీగా..

అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో న‌టిస్తున్న‌ పుష్ప 2 లో ర‌ష్మిక తిరిగి శ్రీ‌వ‌ల్లిగా అభిమానుల‌ను అల‌రించ‌నుంది. మొద‌టి భాగంలో డీగ్లామ‌ర‌స్ పాత్ర‌లో ర‌ష్మిక న‌ట‌న‌కు ప్ర‌జ‌లు మంత్ర‌ముగ్ధుల‌య్యారు. ఇప్పుడు పార్ట్ 2లోను ర‌క్తి క‌ట్టించే స‌న్నివేశాల్లో ర‌ష్మిక క‌నిపించ‌నుంది. పుష్ప 1 కంటే రెట్టింపు యాక్ష‌న్ తో పార్ట్ 2 అల‌రించ‌నుంద‌ని స‌మాచారం.

చావాలో ..

త‌దుప‌రి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించనున్న హిందీ చిత్రం చావాలో రష్మిక కథానాయికగా కనిపించనుంది. ఇందులో విక్కీ కౌశ‌ల్ క‌థానాయ‌కుడు. చావా హిస్టారిక‌ల్ క‌థాంశంతో రూపొందుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఒక చారిత్రక నాటకంగా ఇది తెర‌కెక్కుతోంది. విక్కీ టైటిల్ పాత్ర‌ను పోషిస్తున్నాడు. శంభాజీ మ‌హ‌రాజ్ భార్య ఏసు భాయ్ బోన్స‌లే పాత్ర‌లో ర‌ష్మిక క‌నిపించ‌నుంది.

ది గ‌ర్ల్ ఫ్రెండ్ ..

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక తెలుగు చిత్రం గర్ల్‌ఫ్రెండ్ షూటింగ్ లో ఉంది. ర‌ష్మిక 28వ పుట్టినరోజును పురస్కరించుకుని, `ది గర్ల్‌ఫ్రెండ్` మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టర్‌లను షేర్ చేయ‌గా అద్బుత స్పంద‌న వ‌చ్చింది. గీతా ఆర్ట్స్ అండ‌దండ‌ల‌తో రూపొందుతున్న చిత్ర‌మిది. పోస్టర్లను బ‌ట్టి ఈ సినిమాలో రష్మిక కాలేజీ స్టూడెంట్‌గా నటిస్తోంద‌ని భావిస్తున్నారు.

కుబేర‌లో ...

మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న కుబేర చిత్రంలో ధ‌నుష్ స‌ర‌స‌న‌ రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఇందులో నాగార్జున ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ధ‌నుష్‌, నాగార్జున లుక్ లు రిలీజ్ చేయ‌గా వాటికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. డబ్బు చుట్టూ తిరిగే క‌థ‌తో ఈ సినిమా రూపొంద‌నుంది. ధనుష్ ఇందులో నిరాశ్రయుడైన వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి చివరికి శక్తివంతమైన మాఫియాగా ఎలా ఎదిగాడ‌న్న‌ది తెర‌పై చూపిస్తున్నారు. ఇందులో జిమ్ సర్భ్ ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుబేర అనేది పాన్-ఇండియా బహుభాషా చిత్రం. తమిళం, తెలుగు, హిందీలో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు.

యానిమ‌ల్ పార్క్:

సందీప్ రెడ్డి వంగాతో యానిమల్ పార్క్‌లోను ర‌ష్మిక‌ కనిపించనుంది. ఈ చిత్రం తదుపరి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇంత పెద్ద లైనప్ తో రానున్న రోజుల్లో రష్మిక ఇండియన్ సినిమాని డామినేట్ చేయబోతోంది. ర‌ణ‌బీర్ ఈ చిత్రంలో న‌టించే ముందే నితీష్ తివారీ రామాయ‌ణం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు.

నేటిత‌రంలో ర‌ష్మిక స్పీడ్ ని అందుకోవ‌డం ఇత‌ర భామ‌ల‌కు అంత సులువేమీ కాదు. తెలివైన ఎంపిక‌లు అద్భుత ప్ర‌ణాళిక‌ల‌తోనే ఇది సాధ్యం అని చెప్పాలి.