Begin typing your search above and press return to search.

రష్మిక.. అన్ని వైపులా హిట్టే

నేషనల్ క్రష్ రష్మిక మందన యానిమల్ మూవీ సక్సెస్ తో ఓ రేర్ ఫీట్ అందుకుంది. దీనికంటే ముందు బాలీవుడ్ లో పలు సినిమాలు చేసింది.

By:  Tupaki Desk   |   11 Dec 2023 3:15 AM GMT
రష్మిక.. అన్ని వైపులా హిట్టే
X

నేషనల్ క్రష్ రష్మిక మందన యానిమల్ మూవీ సక్సెస్ తో ఓ రేర్ ఫీట్ అందుకుంది. దీనికంటే ముందు బాలీవుడ్ లో పలు సినిమాలు చేసింది. అవేమీ ఈమెకు గుర్తింపు తేలేకపోయాయి. కానీ రణబీర్ సరసన నటించిన యానిమల్ రష్మిక కి బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ ని అందించింది. ఈ సక్సెస్ తో బాలీవుడ్ లోనే కాదు అన్ని ఇండస్ట్రీలోనూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న హీరోయిన్ గా అరుదైన ఘనత సాధించింది రష్మిక మందన.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకున్న రష్మికకి తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ ఇండస్ట్రీల్లోనూ మంచి క్రేజ్ ఉంది. అందుకే తెలుగులో సినిమాలు చేస్తూనే హిందీ, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంది. కిరిక్ పార్టీ అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఆరెంగేట్రం చేసిన రష్మిక మొదటి సినిమాతోనే అక్కడ బ్లాక్ బాస్టర్ అందుకుంది.

ఆ తర్వాత 'ఛలో' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలకు అడుగుపెట్టి అగ్ర హీరోల సరసన వరుస బ్లాక్ బాస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ ఏడాది కోలీవుడ్లో దళపతి విజయ్ సరసన 'వారిసు' మూవీలో నటించి తమిళంలో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక ఇప్పుడు యానిమల్ తో బాలీవుడ్ లో మరో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. అలా టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్.. అన్ని ఇండస్ట్రీల్లో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందిరష్మిక.

యానిమల్ సక్సెస్ తో రష్మిక తన కెరీర్ ల్ పీక్ స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇక ఈ మూవీ తర్వాత ఈ ఈ ముద్దుగుమ్మకి పుష్ప: ది రూల్ తో పాటూ తన రాబోయే చిత్రాలతో మరింత క్రేజ్ పెరగడం ఖాయమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ప్రస్తుతం యానిమల్ సక్సెస్ ని తెగ ఎంజాయ్ చేస్తున్న రష్మిక 'పుష్ప 2' తో పాటు 'ది గర్ల్ ఫ్రెండ్' అని లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లాంచనంగా ప్రారంభమైంది.

రాహుల్ రవీంద్రన్ ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. రష్మిక నటిస్తున్న ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు ఇదే కావడంతో ఈ ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి నెలకొంది. మరోవైపు ఇన్ని రోజులు యానిమల్ ప్రమోషన్స్ తో బిజీ బిజీగా గడిపిన రష్మిక త్వరలోనే పుష్ప 2 సెట్స్ లో అడుగుపెట్టనుంది. డిసెంబర్ 13 నుంచి రష్మిక 'పుష్ప 2' షూటింగ్లో జాయిన్ కానున్నట్లు సమాచారం.