Begin typing your search above and press return to search.

ర‌ష్మిక కి ఎవ‌రి స‌ల‌హాలు అవ‌స‌రం లేదుట‌!

మ్యాక‌ప్..న‌ట‌న‌..డైలాగులు చెప్పే విధానం బాగోలేద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. క‌ర్వాచౌత్ స‌న్నివేశ‌మైతే ఏకంగా ట్రోలింగ్ కి సైతం గురైంది.

By:  Tupaki Desk   |   8 April 2024 9:30 AM GMT
ర‌ష్మిక కి ఎవ‌రి స‌ల‌హాలు అవ‌స‌రం లేదుట‌!
X

'యానిమ‌ల్' స‌క్సెస్ త‌ర్వాత నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక రేంజ్ ఆకాశ‌న్నంటుతోన్న సంగ‌తి తెలిసిందే. 'పుష్ప' త‌ర్వాత పాన్ ఇండియాలో 'యానిమ‌ల్' తో మ‌రో భారీ విజ‌యం రావ‌డంతో అమ్మ‌డి రేంజ్ అంత‌కంత‌కు రెట్టింపు అయింది. మార్కెట్ ప‌రంగా పారితోషికం రెట్టింపు చేసింది. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దాలి అనే నిబంధ‌న ఫాలో అవుతోంది. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే 'యానిమల్' లో ర‌ష్మిక‌ పెర్పార్మెన్స్ ప‌క్క‌న బెడితే కొన్ని విషాయ‌ల్లో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కున్న సంగ‌తి తెలిసిందే.

మ్యాక‌ప్..న‌ట‌న‌..డైలాగులు చెప్పే విధానం బాగోలేద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. క‌ర్వాచౌత్ స‌న్నివేశ‌మైతే ఏకంగా ట్రోలింగ్ కి సైతం గురైంది. అయితే వీటి గురించి ఇంత‌వ‌ర‌కూ ర‌ష్మిక సైలెంట్ గా ఉన్నా? ఇప్పుడు మాత్రం తెర మీద‌కొచ్చి శివతాండ‌వం ఆడేసింది. అమ్మ‌డు ఈసారి కాస్త టోన్ పెంచే మాట్లాడింది. క‌ర్వాచౌత్ స‌న్నివేశ‌మే సినిమాకి హైలైట్..ప్ర‌త్యేకంగా నిలిచింది. ఆసీన్ కోసం నేనెంత క‌ష్ట‌ప‌డ్డానో మీకేం తెలుసు? ఆ సీన్ లో ర‌క‌ర‌కాల హావ‌భాలు ప‌లికించాల్సి వ‌చ్చింది.

అందుకోసం చాలా ప్రాక్టీస్ చేసాను. అందులో నా న‌ట‌న చూసి సెట్లో ..థియేట‌ర్లో ఎంతో మంది ప్ర‌శంసించారు. కానీ కొంద‌రు విమ‌ర్శించారు. ఎందుకో నాక‌ర్దం కాలేదు. ఇది నాకు విచిత్రంగా అనిపిస్తుంది. తొమ్మిది నిమిషాల సీన్ లో ప‌ది సెకెన్ల డైలాగ్ బాగోలేద‌ని ట్రోల్ చేసారు. ఇలాంటి వాటిని ప‌ట్టించుకోను. ఎలాంటి స‌న్నివేశాల్లో ఎలా న‌టించాలో నాకు తెలుసు. ఎదుట వారి స‌ల‌హాలు తీసుకుని న‌టించే స్థానంలో నేను లేను. అయినా ఎవ‌రి అభిప్రాయం వారిది.

నేను న‌టించింది అంద‌రికీ న‌చ్చాల‌ని లేదు క‌దా' అని ముగింపు ప‌లికింది. ర‌ష్మిక‌పై ట్రోలింగ్ ఇప్ప‌టికి చాలాసార్లు జ‌రిగింది. కానీ ఏ నాడు ఇలా టోన్ పెంచి మాట్లాడింది లేదు. తొలిసారి అమ్మ‌డు కాస్త ఘాటుగానే ట్రోల‌ర్స్ కి రిప్టై ఇచ్చిన‌ట్లు ఉంది. ర‌ష్మిక‌లో ఈ రేంజ్ తిరుగుబాటు ఆమెపై డీప్ ఫేక్ వీడియో వైర‌ల్ అయిన స‌మ‌యంలో బ‌య‌ట‌కు వ‌చ్చింది. తొలుత ఆ వీడియోపై స్త‌బ్దుగా ఉన్నా త‌ర్వాత ఒక్క‌సారిగా శివంగిలా తిర‌గ‌బ‌డిన వైనం తెలిసిందే.