Begin typing your search above and press return to search.

రష్మిక.. కళ్ళతోనే నవ్వడమంటే ఇదేనేమో..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 April 2024 10:35 AM GMT
రష్మిక.. కళ్ళతోనే నవ్వడమంటే ఇదేనేమో..
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ బ్యూటీ. తన యాక్టింగ్ తో విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. పలువురు సినీ ప్రముఖులు కూడా ఆమె నటనను మెచ్చుకున్నారు. ఈ ఏడాది లో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ తో అలరించనుంది రష్మిక. నేడు ఆమె బర్త్ డే కావడంతో ఆయా సినిమాల మేకర్స్ అప్డేట్స్ ఇస్తున్నారు.


నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక.. గర్ల్ ఫ్రెండ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్.. హీరో ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే ఈ మూవీ టీజర్.. నేడు రిలీజ్ చేస్తామని రాహుల్ రవీంద్రన్ ఇప్పటికే ప్రకటించారు. కానీ రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

"ఆమె కన్నా ముందు ఆమె కళ్లు నవ్వుతాయి. ఆమె మాట్లాడని మాటలు కూడా మాట్లాడతాయి. గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తున్నాం. నేషనల్ క్రష్ కు హ్యాపీ బర్త్ డే" అంటూ మేకర్స్ పోస్ట్ చేశారు. పోస్టర్ లో రష్మిక ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టింది. 90s డ్రెస్సింగ్ స్టైల్ లో ఆకట్టుకుంటుంది. ఆమె చేతికి ఉన్న వాచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

అందాల రాక్షసి మూవీతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాహుల్ రవీంద్రన్.. గర్ల్ ఫ్రెండ్ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. చి ల సౌ తో డైరెక్టర్ గా మారిన ఆయన.. ఐదేళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. 2024 లో ప్రేక్షకుల ముందుకు రానుందని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మోగిలేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అల్లు అరవింద్ ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహీద్ బాణీలు కడుతున్నారు. కృష్ణన్ వసంత సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ అవ్వనున్న ఈ సినిమా.. ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.