'యానిమల్'క్రేజ్ తో రష్మిక పెంచేసిందా?
వెండి తెర గొప్ప పెర్పార్మర్ మాత్రమే కాదు అంతకు మంచి తనదైన శైలిలో ఎదుట వారిని ఆకర్షించుకోవడంలో తనదమైన ముద్ర కనిపిస్తుంది.
By: Tupaki Desk | 2 Oct 2023 11:30 PM GMTనేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక మందన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ సోషల్ మీడియా లో భారీ ఫాలోయింగ్ ఉన్న నటి. తనదైన శైలి చమత్కారలతో జనాల్ని ఆకర్షించడంలో అమ్మడి దగ్గర ఉన్న టెక్నిక్ లే మరే నటి దగ్గరా లేవంటే? అతిశయోక్తి కాదు. వెండి తెర గొప్ప పెర్పార్మర్ మాత్రమే కాదు అంతకు మంచి తనదైన శైలిలో ఎదుట వారిని ఆకర్షించుకోవడంలో తనదమైన ముద్ర కనిపిస్తుంది.
అందుకే సోషల్ మీడియాలో అంత ఫాలోయింగ్ ఉన్న నటి అయింది. ఇక కెరీర్ పరంగా టాలీవుడ్ టూ బాలీవుడ్ దూసుకుపోతుంది. `పుష్ప` తో పాన్ ఇండియా క్రేజ్ ని ఆస్వాదిస్తోంది. `యానిమల్` కూడా హిట్ అయితే ఆమ్మడి రేంజ్ టచ్ చేయని స్థాయికి రీచ్ అవుతుందని అంచనాలున్నాయి. మరి ఈ బ్యూటీ ఒక్కో సినిమాకి ఎంత ఛార్జ్ చేస్తుంది? అంటే ఇంతవరకూ మూడు కోట్లు అని వినిపించింది. తాజాగా అమ్మడు మరో కోటి పెంచి నాలుగు కోట్లు పారితోషికంగా తీసుకుంటుందన్న విషయం లీకైంది.
ఈ కోటి పెపకం అన్నది ఈ మద్యనే జరిగినట్లు తెలుస్తోంది. `పుష్ప` రిలీజ్ అనంతరం రష్మిక హైక్ చేస్తుందని ప్రచారం సాగిందిగానీ..అందులో క్లారిటీ లేదు. అయితే తాజాగా ఆమె అమ్మడి డైరీలో కొత్త రూల్స్ రాసిపెట్టికుందిట. దీనిలో భాగంగానే పారితోషికంలోనూ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. `యానిమల్` రిలీజ్ అయి హిట్ అయితే ఆ నెంబర్ కూడా పెంచే అవకాశం ఉందిట. లేదంటే యధావిధిగా నాలుగు కోట్లు తీసుకుంటుంది.
ఇక్కడ కోటి పెంచడానికి ఓ కారణం ఉంది. `యానిమల్` రిలీజ్ కి ముందే ఇలా చేస్తే! ఈ గ్యాప్ లో కొన్ని ప్రాజెక్ట్ లు లాక్ చేయోచ్చు. వాటి ద్వారా తాను కోట్ చేసిన మొత్తం వస్తుంది. ఒకవేళ సినిమా అటు ఇటూ అయితే బ్యాలెన్స్ గా వెళ్లొచ్చు ! అన్నది అమ్మడి ప్లాన్ గా తెలుస్తోంది. ఇక ఎండార్స్ మెంట్స్ విషయంలో రష్మిక చాలా కాలంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
తన దగ్గరకువచ్చిన ఏ బ్రాండింగ్ ని విడిచిపెట్టదు. వాటి ద్వారా ఎంతో కొంత ఆదాయం సమకూరుతుందని కమిట్ అవుతుది. ఆ లెక్కన చూస్తే రష్మిక మందన్న నికర విలువ 45 కోట్లు. నివేదికలప్రకారం ఎనిమిది కోట్లు వార్షిక ఆదాయంతో నెలకు 60 లక్షల వరకూ సంపాదిస్తోందని తెలుస్తోంది.