Begin typing your search above and press return to search.

యానిమల్ జోడీ రిఫ్రెష్ మెంట్.. థ్రిల్ చేశారుగా..!

7 అప్ యాడ్ కోసం రణ్ బీర్ కపూర్, రష్మిక జత కట్టారు. లేటెస్ట్ గా రిలీజైన ఈ యాడ్ కోసం యానిమల్ జోడీ కలిసి పనిచేయడం ఫ్యాన్స్ ని అలరిస్తుంది.

By:  Tupaki Desk   |   2 April 2024 5:39 AM GMT
యానిమల్ జోడీ రిఫ్రెష్ మెంట్.. థ్రిల్ చేశారుగా..!
X

రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా యానిమల్. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలు చూసిన ఆడియన్స్ రణ్ బీర్ తో చేస్తున్న యానిమల్ అంతకుమించి ఉంటుందని అంచనా వేయగా వాటికి ఏమాత్రం తగ్గకుండా సినిమా వచ్చింది. లాస్ట్ డిసెంబర్ రిలీజైన యానిమల్ పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ విక్టరీ అందుకుంది. ఈ సినిమాతో రణ్ బీర్ కపూర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. రణ్ బీర్ కపూర్, రష్మికల జోడీ సినిమాకు హైలెట్ కాగా సినిమాలో స్పెషల్ రోల్ చేసిన త్రిప్తి డిమ్రి కూడా సూపర్ పాపులర్ అయ్యింది.

యానిమల్ ఎండింగ్ లో యానిమల్ పార్క్ అంటూ మరో సినిమా అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేశాడు సందీప్ వంగ. అయితే యానిమల్ పార్క్ కన్నా ముందు సందీప్ రెండు సినిమాలు చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. అందులో ఒకటి ప్రభాస్ స్పిరిట్ కాగా మరొకటి అల్లు అర్జున్ సినిమా ఉండనుంది. రణ్ బీర్ కపూర్ తో యానిమల్ 2 అదే యానిమల్ పార్క్ 2026 లో ఉండే ఛాన్స్ ఉంది.

ఇదిలా ఉంటే యానిమల్ స్టార్స్ రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్న కలిసి మరోసారి నటించారు. అయితే ఈసారి సినిమాలో కూడా ఒక యాడ్ కోసం ఇద్దరు జత కట్టారు. 7 అప్ యాడ్ కోసం రణ్ బీర్ కపూర్, రష్మిక జత కట్టారు. లేటెస్ట్ గా రిలీజైన ఈ యాడ్ కోసం యానిమల్ జోడీ కలిసి పనిచేయడం ఫ్యాన్స్ ని అలరిస్తుంది. దీనికి సంబందించిన వీడియో షేర్ చేసింది రష్మిక. ప్రస్తుతం ఉన్న హీట్ కి దీనితో సూపర్ డూపర్ రీఫ్రెష్ అవ్వాల్సిందే అంటూ 7 అప్ తో వస్తున్నారు.

ఒక సినిమాతో సూపర్ హిట్ జోడీ అనిపించుకుంటే వాణిజ్య ప్రకటనలకు ఆ జంటని విపరీతంగా వాడేస్తుంటారు. సమ్మర్ లో కూల్ డ్రింక్స్ సేల్స్ అందరికీ తెలిసిందే. అందుకే 7 అప్ కోసం రణ్ బీర్, రష్మిక కలిసి బ్రాండింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎవరికి వారు వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. రష్మిక పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్, కుబేర సినిమాల్లో నటిస్తుంది. రణ్ బీర్ కపూర్ రామాయణ్ కోసం సిద్ధం అవుతున్నాడు.