Begin typing your search above and press return to search.

కాబోయే భర్త VDలా.. నిజం అంటూ రష్మిక సమాధానం

అసలు మ్యాటర్ లోకి వెళితే ఇటీవల సోషల్ మీడియాలో నెటిజన్స్ అడుగుతున్న ప్రశ్నలకు చాలా చలాకీగా సమాధానం చెబుతున్న రష్మిక ఒక అభిమాని రష్మీకకు కాబోయే భర్త ఇలా ఉండాలి అని చెప్పింది.

By:  Tupaki Desk   |   27 Feb 2024 7:27 AM GMT
కాబోయే భర్త VDలా.. నిజం అంటూ రష్మిక సమాధానం
X

సినిమా ఇండస్ట్రీలో వెండితెరపై ఈ రోజుల్లో బెస్ట్ జోడిగా గుర్తింపు అందుకున్న వారిలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న కూడా టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా వెండితెరపై కెమిస్ట్రీ మాత్రం అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. అందుకే ఈ జంటకు ఫ్యాన్స్ కూడా గట్టిగానే ఉన్నారు. అయితే వీరి మధ్యలో ప్రేమ కొనసాగుతోంది అని ఇదివరకే చాలా రకాల గాసిప్స్ అయితే వైరల్ అయ్యాయి.

హీరోయిన్స్ తో హోమాలు పూజలు చేయించే వేణు స్వామి కూడా రష్మిక పెళ్లిపై ఊహించిన విధంగా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయంపై రష్మిక ఎప్పుడూ కూడా పెద్దగా స్పందించడానికి ఇష్టపడలేదు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె ఇచ్చిన ఒక రిప్లై హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆమెకు కాబోయే భర్త VD (విజయ్ దేవరకొండ) అంటూ తెగ ప్రచారాలు చేస్తున్నారు.

అసలు మ్యాటర్ లోకి వెళితే ఇటీవల సోషల్ మీడియాలో నెటిజన్స్ అడుగుతున్న ప్రశ్నలకు చాలా చలాకీగా సమాధానం చెబుతున్న రష్మిక ఒక అభిమాని రష్మీకకు కాబోయే భర్త ఇలా ఉండాలి అని చెప్పింది. మీకు కాబోయే భర్త చాలా స్పెషల్ గా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు రష్మిక నేషనల్ క్రష్. ముఖ్యంగా ఆమె భర్త VD లా ఉండాలి. అంటే ఎల్లప్పుడూ తనను ప్రొటెక్ట్ చేసే విధంగా డేరింగ్ గా ఉండాలి.

ఆమెను మనం ఒక మహారాణిగా పిలుస్తాము.. కాబట్టి ఆమెకు కాబోయే భర్త మహారాజులా ఉండాలి అని ఆ నేటిజన్ వివరణ ఇచ్చింది. దీంతో రష్మిక కూడా చాలా క్యూట్ గా రిప్లై ఇచ్చింది.. "అవును ఇది నిజం" అంటూ ఆమె లవ్ సింబల్ కూడా జత చేయడంతో సోషల్ మీడియాలో ఈ రిప్లై ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. రష్మిక తన మనసులోని మాటను చెప్పేసింది అంటూ VD ఆమెకు కాబోయే భర్త అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

అయితే రష్మిక మాత్రం అలాంటి క్వాలిటిస్ ఉండాలి అనే విధంగా తన భావాలను వ్యక్తపరిచింది అంటూ మరి కొందరు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై రష్మిక మరోసారి క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఆమె పుష్ప సెకండ్ పార్ట్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ లో మరో రెండు సినిమాలు చేస్తోంది.