బన్నీ 26 లో నేషనల్ క్రష్ నీలాంబరి!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 July 2025 7:00 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ముంబైలో షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో బన్నీకి జోడీగా ముగ్గురు నాయికలు నటిస్తున్నారు. దీపికా పదుకొణే మెయిన్ లీడ్ కాగా, మృణాల్ ఠాకూర్ సెకెండ్ లీడ్ ...థర్డ్ లీడ్ లో జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు ప్రచారం లో ఉంది. జాన్వీ పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక నటిస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. వీళ్లిద్దరిలో థర్డ్ లీడ్ ఎవరు? అన్నది ఇంకా కన్పమ్ కాలేదు.
అయితే తాజాగా ఇదే సినిమాలో రష్మిక విలన్ గా నటిస్తోంది అనే కొత్త ప్రచారం షురూ అయింది. విలన్ పాత్రకు మేల్ కంటే ఫీమేల్ అయితే పర్పెక్ట్ గా సూటవుతుందని..ప్రత్యేకించి ఆ పాత్రలో రష్మిక అయితే నూరు శాతం యాప్ట్ అవుతుందనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో రష్మిక ప్రతి నాయిక? అన్నది సోషల్ మీడియాలో ఊపందుకుంది. రష్మిక కూడా ఇంట్రెస్టింగ్ రోల్ కావడంతో నో చెప్పకుండా ఎస్ చెప్పిందని గట్టిగానే వినిపిస్తుంది.
మరి ఈ ప్రచారమంతా నిజమా? కాదా? జాన్వీ కపూర్ ని రీప్లేస్ చేస్తుందా? విలన్ అవుతుందా? అన్నది మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తే గానీ క్లారిటీ రాదు. నిజంగా విలన్ పాత్ర పోషిస్తే గనుక ఆ పాత్ర పీక్స్ లో పండే అవకాశం ఉంది. రష్మిక గ్రేట్ పెర్పార్మర్. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతుంది. అందమైన హీరోయిన్ గా మెప్పిస్తుంది. అవసరమైతే శివంగిలా మారిపోతుంది. `పుష్ప2` లోశ్రీవల్లి పాత్రను ఏ రేంజ్ లో పండించిందో తెలిసిందే.
యెగ్రెసివ్ రోల్ లో ఆద్యంతం ఆకట్టుకుటుంది. అటుపై` ఛావా` చిత్రంలో మహారాజ్ భార్య పాత్రలోనూ ధీరనితగా అలరించింది. ఇలా ప్రతీ చిత్రానికి తనను తాను మరింత మెరుగు పరుచుకుంటుంది. ఇప్పుడు రమ్యకృష్ణలా నీలాంబరిలో అలరించడం విషయంలో రష్మిక తగ్గేదేలే.
